T20 WORLD CUP: సూపర్ – 12 సమరానికి సై.. సంచలన విజయాలతో తుది పోరుకు దూసుకొచ్చిన పసికూనలు..

|

Oct 21, 2022 | 7:10 PM

ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. గ్రూపు దశ మ్యాచ్ లు ముగిశాయి. ఇక శనివారం నుంచి సూపర్-12 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా..

T20 WORLD CUP: సూపర్ - 12 సమరానికి సై.. సంచలన విజయాలతో తుది పోరుకు దూసుకొచ్చిన పసికూనలు..
T20 World Cup
Follow us on

స్పోర్ట్స్ విషయానికొస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎంత పెద్ద ప్లేయర్ అయినా బరిలో దిగిన రోజు ఎలాంటి ప్రదర్శన ఇచ్చారన్నదే ముఖ్యం. ఒక్కోసారి స్టార్ ప్లేయర్లకు కూడా ఓటమి తప్పుదు. గతంలో ఛాంపియన్లు అయి ఉండవచ్చు.. కాని క్రీడల్లో ప్రస్తుతం ఏమిటనేదే ముఖ్యం. ఓ జట్టుకు ఎన్ని రికార్డులు అయినా ఉండొచ్చు. కాని ఆ రోజు ఎలా ఆడిందనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. గ్రూపు దశ మ్యాచ్ లు ముగిశాయి. ఇక శనివారం నుంచి సూపర్-12 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఎనిమిది జట్లు క్వాలిఫయిర్‌ రౌండ్‌లో తలపడగా.. గ్రూప్-ఎ, గ్రూప్-బి నుంచి పాయింట్ల పట్టికలో ముందునిలిచిన రెండేసి జట్లు కలిపి మొత్తం నాలుగు జట్లు సూపర్‌-12కి అర్హత సాధించాయి. పసి కూనలు అనుకొన్న జట్లే చివరి వరకు అద్భుతంగా పోరాడాయి. టాప్‌ -8 జట్లతో పాటు సూపర్-12కు మరో నాలుగు జట్లు వచ్చి చేరాయి. శనివారం నుంచే సూపర్‌-12 పోరు ప్రారంభం కానుంది.

మొదటి రౌండ్‌లో గ్రూప్‌ – ఎ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్‌, గ్రూప్‌ – బి నుంచి ఐర్లాండ్‌, జింబాబ్వే సూపర్-12కు చేరాయి. క్వాలిఫయిర్‌ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై విజయంతో జింబాబ్వే అర్హత సాధించింది. అనూహ్యంగా రెండుసార్లు ఛాంపియన్‌ వెస్టిండీస్‌ ఈసారి క్వాలిఫయిర్‌ నుంచే ఇంటిముఖం పట్టింది. గత టీ20 ప్రపంచకప్‌లో ఆడిన 12 జట్లలో ఈసారి వెస్టిండీస్‌, నమీబియా, స్కాట్లాండ్‌ జట్లు లేవు. వాటి బదులు నెదర్లాండ్స్‌, జింబాబ్వే కొత్తగా వచ్చి చేరాయి. బంగ్లాదేశ్‌ ఇప్పటికే సూపర్‌-12లో ఉంది. గత టోర్నమెంట్ లో బంగ్లాదేశ్‌ జట్టు అర్హత మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.

ఆరేసి జట్లతో సూపర్‌ -12లో రెండు గ్రూప్‌లు తుది పోరుకు సిద్ధమయ్యాయి. టైటిల్‌ కోసం మొత్తం 12 జట్లు తలపడనున్నాయి. భారత్‌, పాకిస్తాన్ క్రికెట్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య అక్టోబర్ 22వ తేదీ శనివారం జరిగే తొలి మ్యాచ్‌తో సూపర్‌ -12 పోరు మొదలుకానుంది. గ్రూప్‌ 1 లో న్యూజిలాండ్‌, శ్రీలంక, ఆఫ్గానిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, ఐర్లాండ్ జట్లు ఉండగా, గ్రూప్‌ 2లో  దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్, భారత్‌, పాకిస్థాన్‌, జింబాబ్వే  జట్లు ఉన్నాయి. సాధారణంగా చిన్నజట్లపై జరిగే మ్యాచ్ లో పెద్దజట్లు సులభంగా గెలవచ్చని అంతా భావిస్తారు. కాని టీ20 ఫార్మాట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఏం జట్టు పై ఏ జట్టు విజయం సాధిస్తుందనేది చివరి వరకు ఉత్కంఠగా మారుతోంది. ఇప్పటికే క్వాలిఫయర్‌ రౌండ్‌లో ఆడి వచ్చాయని చిన్న జట్లును తక్కువగా చూస్తే మాత్రం పెద్ద జట్లు ఇబ్బంది పడాల్సిందేనంటున్నారు క్రీడా విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి

టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టునూ తక్కువగా అంచనా వేయలేం. అయితే ఆయా గ్రూప్‌ల నుంచి టాప్‌ -2గా నిలిచిన జట్లే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తొలి రౌండ్‌లో ఆసియా కప్‌ విజేత శ్రీలంకకే నమీబియా వంటి చిన్న జట్టు షాక్‌ ఇచ్చింది. అలాగే వెస్టీండీస్ కు ఐర్లాండ్ తో పాటు స్కాట్లాండ్‌, జింబాబ్వే ఝలక్‌ ఇచ్చాయి. ఇప్పటికే ఆసీస్‌ పిచ్‌ పరిస్థితులకు బాగా అలవాటు పడిన టీమ్‌లు కీలకమైన సూపర్‌-12 పోరులో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. సెమీస్‌కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్‌ ఫలితం ఎంతో కీలకం కానుంది. శనివారం నుంచి సూపర్-12 సమరం మొదలుకానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..