AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియా గెలిచినా ఏదో లోటు..’విలియమ్సన్​​’ నువ్వు సూపర్ హీరోవి…

వార్ వన్ సైడ్ అయిపోయింది. మరో రెండు మ్యాచులు మిగిలుండగానే భారత్ ​టీ20 సిరీస్‌ కైవసం చేసుకుంది. స్వదేశంలో కేన్ సేనకు పరాభవం తప్పలేదు. మొదటి రెండు టీ20లలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని న్యూజిలాండ్ టీమ్, 3వ మ్యాచ్‌లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన టీమ్‌ను గెలిపించేందుకు వీరోచిత పోరాటం చేశాడు. మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో ఫలితం భారత్‌కు కలిసొచ్చింది. చివరి రెండు బంతుల్లో సిక్సర్లతో విరుచుకుపడ్డ రోహిత్ శర్మ..న్యూజిల్యాండ్ […]

ఇండియా గెలిచినా ఏదో లోటు..'విలియమ్సన్​​' నువ్వు సూపర్ హీరోవి...
Ram Naramaneni
|

Updated on: Jan 30, 2020 | 1:44 PM

Share

వార్ వన్ సైడ్ అయిపోయింది. మరో రెండు మ్యాచులు మిగిలుండగానే భారత్ ​టీ20 సిరీస్‌ కైవసం చేసుకుంది. స్వదేశంలో కేన్ సేనకు పరాభవం తప్పలేదు. మొదటి రెండు టీ20లలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని న్యూజిలాండ్ టీమ్, 3వ మ్యాచ్‌లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన టీమ్‌ను గెలిపించేందుకు వీరోచిత పోరాటం చేశాడు. మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో ఫలితం భారత్‌కు కలిసొచ్చింది. చివరి రెండు బంతుల్లో సిక్సర్లతో విరుచుకుపడ్డ రోహిత్ శర్మ..న్యూజిల్యాండ్ ఆశలపై నీళ్లు చల్లాడు.

మ్యాచ్ అనంతరం ఓటమిపై విలియమ్సన్‌ స్పందించాడు. సూపర్‌ ఓవర్‌లు తమకు ప్రెండ్స్ కాదని అభిప్రాయపడ్డాడు. భారత్ టీం తన అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించిందని, వారి నుంచి ఎంతో నేర్చుకోవాలని పేర్కొన్నాడు. మున్ముందు మంచి ప్రదర్శన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే భారత్ విజయం సాధించినా తమకు ఏదో లోటుగా ఉందని ఇండియా క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎన్ని ఓటములు వచ్చినా..కేన్ మోముపై చిరునవ్వు చెరగదని, సెల్యూట్ కేన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రజంట్ కేన్‌పై వస్తోన్న మీమ్స్ చూస్తుంటే అతని ఇండియాలో ఎంతమంది అభిమానులు ఉన్నారో కూడా అర్దమవుతోంది. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌కి కూడా మన దగ్గర ఇదే రేంజ్ అభిమానులు ఉండటం చెప్పుకోదగ్గ అంశం. ఇక వరల్డ్ కప్‌ ఫైనల్లో కూడా న్యూజిలాండ్‌ను సూపర్ ఓవరే ముంచేసింది.

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు