20 ఏళ్ళు దాటినా కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలు ఆగవు – గవాస్కర్
ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు వచ్చాయంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే అలాంటివి ఏమి లేవని అటు కోహ్లీ, ఇటు రోహిత్ శర్మ ఇద్దరూ కూడా స్పష్టం చేశారు. జట్టులో విభేదాలు ఉంటే అద్భుతమైన ఫలితాలు వచ్చేవి కావని కోహ్లీని మీడియాను తీవ్రంగా విమర్శించాడు. అటు ఈ కథనాలపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తాజాగా స్పందించాడు. కోహ్లీ, రోహిత్ శర్మ […]
ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు వచ్చాయంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే అలాంటివి ఏమి లేవని అటు కోహ్లీ, ఇటు రోహిత్ శర్మ ఇద్దరూ కూడా స్పష్టం చేశారు. జట్టులో విభేదాలు ఉంటే అద్భుతమైన ఫలితాలు వచ్చేవి కావని కోహ్లీని మీడియాను తీవ్రంగా విమర్శించాడు. అటు ఈ కథనాలపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తాజాగా స్పందించాడు.
కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాల కథనాలు మరో 20 ఏళ్లకు కూడా ఆగవని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘విబేధాలు లేవని వాళ్లిద్దరూ స్వయంగా చెప్పినా ఈ కథనాలు ఆగవు. రోహిత్ ఔటైనా ప్రతిసారి అతను ఉద్దేశపూర్వకంగానే ఔటయ్యాడంటూ కథనాలు సృష్టించేవారు చాలామంది ఉన్నారు. ఇవి మీడియాకు అమృతం లాంటి వార్తలు. వీటితో ఆటగాళ్లు, జట్టుకు చాలా నష్టం. క్రికెటర్ల మధ్య అనుబంధానికి ఇబ్బంది అని సన్నీ చెప్పారు.