చివరి మ్యాచ్.. మలింగకు ఘనమైన వీడ్కోలు ఇస్తాం

15ఏళ్ల కెరీర్‌కు ఇవాళ ముగింపు పలకనున్నాడు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ. వన్డే సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగబోతున్న తొలి మ్యాచ్‌ మలింగకు ఆఖరి వన్డే అవ్వనుంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించి లసిత్‌కు ఘనమైన వీడ్కోలు పలుకుతామని లంక కెప్టెన్ కరుణరత్నె పేర్కొన్నాడు. రేపు జరిగే మ్యాచ్‌లో విజయమే మా ముందున్న మొదటి లక్ష్యం. ఇది మలింగకు మేమిచ్చే అత్యుత్తమ కానుక. ఆయనకు కచ్చితంగా అద్భుతమైన వీడ్కోలు ఇస్తాం అని కరుణరత్నె తెలిపాడు. […]

చివరి మ్యాచ్.. మలింగకు ఘనమైన వీడ్కోలు ఇస్తాం

Edited By:

Updated on: Jul 26, 2019 | 10:54 AM

15ఏళ్ల కెరీర్‌కు ఇవాళ ముగింపు పలకనున్నాడు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ. వన్డే సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగబోతున్న తొలి మ్యాచ్‌ మలింగకు ఆఖరి వన్డే అవ్వనుంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించి లసిత్‌కు ఘనమైన వీడ్కోలు పలుకుతామని లంక కెప్టెన్ కరుణరత్నె పేర్కొన్నాడు. రేపు జరిగే మ్యాచ్‌లో విజయమే మా ముందున్న మొదటి లక్ష్యం. ఇది మలింగకు మేమిచ్చే అత్యుత్తమ కానుక. ఆయనకు కచ్చితంగా అద్భుతమైన వీడ్కోలు ఇస్తాం అని కరుణరత్నె తెలిపాడు. కాగా ఇప్పటివరకు 225 వన్డేలు ఆడిన మలింగ 335 వికెట్లు పడగొట్టాడు. లంక తరఫున మురళీధరన్(523), చమిందా వాస్(399) తరువాత అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌గా మలింగ రికార్డులకెక్కాడు.