ఐసీసీ రూల్స్‌పై హిట్ మ్యాన్ గరం.. రూల్స్ మార్చాలన్న రోహిత్

| Edited By:

Jul 15, 2019 | 7:20 PM

ప్రపంచకప్ 2019 సమరం ముగిసింది. సినిమా ట్విస్ట్‌లకు మించి న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే రెండుసార్లు ‘టై’గా నిలిచిన ఫైనల్‌ మ్యాచ్‌లో.. బౌండరీల నిబంధనలతో ఇంగ్లండ్ కప్‌ను సొంతం చేసుకుంది. అయితే ఫైనల్‌లో ఐసీసీ నిబంధనలపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా ఐసీసీ నిబంధలను పెడుతోందని.. వాటిని మార్చివేయాలంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చివరి బంతి వరకు ఇరు జట్లు సమానంగా పోరాటాన్ని […]

ఐసీసీ రూల్స్‌పై హిట్ మ్యాన్ గరం.. రూల్స్ మార్చాలన్న రోహిత్
Follow us on

ప్రపంచకప్ 2019 సమరం ముగిసింది. సినిమా ట్విస్ట్‌లకు మించి న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే రెండుసార్లు ‘టై’గా నిలిచిన ఫైనల్‌ మ్యాచ్‌లో.. బౌండరీల నిబంధనలతో ఇంగ్లండ్ కప్‌ను సొంతం చేసుకుంది. అయితే ఫైనల్‌లో ఐసీసీ నిబంధనలపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా ఐసీసీ నిబంధలను పెడుతోందని.. వాటిని మార్చివేయాలంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

చివరి బంతి వరకు ఇరు జట్లు సమానంగా పోరాటాన్ని చేయగా.. కేవలం బౌండరీను ప్రాతిపాదికగా తీసుకొని విజేతగా ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నలు వేస్తున్నారు. బౌండరీల కన్నా సింగిల్స్ తీస్తూ పరుగులు చేయడమే అసలైన క్రికెట్ అని, అలాంటిది బౌండరీలు చేసిన జట్టును ఎలా విజేతగా ప్రకటిస్తారని పలువురు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈ వాదనకు మద్దతుగా ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెట్ గౌతమ్ గంభీర్ ట్వీట్ కూడా చేయగా.. తాజాగా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ట్వీట్ చేశారు. క్రికెట్‌లోని కొన్ని రూల్స్‌ మీద సీరియస్‌గా దృష్టి సారించాలంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశారు. దీనికి మద్ధతుగా నెటిజన్లు కూడా అవునంటూ కామెంట్లు పెడుతున్నారు.