SFA Championships 9th Day: తొమ్మిదో రోజు చెలరేగిన ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్’.. టాప్‌ రేస్‌లోవున్న స్కూల్ ఇదే

|

Oct 27, 2024 | 3:40 PM

SFA ఛాంపియన్‌షిప్‌ 2024 పోటీలు హోరాహోరీ గా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు బ్యాట్మింటన్‌, క్యారమ్స్‌, అథ్లెటిక్స్‌లో ఆయా స్కూళ్లకు చెందిన యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీలు అక్టోబరు 28 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకూ అన్నీ క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిచిన..

SFA Championships 9th Day: తొమ్మిదో రోజు చెలరేగిన ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్.. టాప్‌ రేస్‌లోవున్న స్కూల్ ఇదే
SFA Championships
Follow us on

దేశంలోని వర్ధమాన క్రీడా ఔత్సాహికులకు బెస్ట్‌ ప్లాట్‌ఫాం ఇచ్చేందుకు టీవీ 9 ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో TV9 నెట్‌వర్క్ దేశంలోనే అతిపెద్ద గ్రాస్‌రూట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA)తో టైఅప్‌ అయ్యింది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఆయా క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నాయి. ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్’ ప్రచారం కొనసాగిస్తుంది. ఇందులో 12 నుంచి 14 యేళ్ల వారికి, అలాగే 15 నుండి 17 యేళ్ల వయసు కలిగిన బాలబాలికలకు అవకాశాలను అందించడంపై దృష్టి సారించాయి. ఈ అద్భుతమైన టాలెంట్ హంట్ ద్వారా బుండెస్లిగా, DFB-పోకల్, ఇండియా ఫుట్‌బాల్ సెంటర్, IFI, BVB, RIESPOలతో కలిసి టీవీ 9 పనిచేస్తుంది. ఇందులోని విజేతలను 2025 ప్రారంభంలో జర్మనీలో సత్కరించనున్నారు.

SFA ఛాంపియన్‌షిప్‌ 2024 పోటీల్లో 9వ రోజు విశేషాలివే..

SFA ఛాంపియన్‌షిప్‌ 2024లో భాగంగా 9వ రోజు కూడా హోరాహోరీగా పోటీలు జరిగాయి. శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన బ్యాడ్మింటన్ కాంపిటీషన్‌లో యువ అథ్లెట్లు వివిధ వయసుల విభాగాల్లో ఫైనల్స్‌లో పోటాపోటీగా తలపడ్డారు. బాలుర, బాలికల సింగిల్స్, డబుల్స్‌ హైలైట్‌గా నిలిచాయి. బాలికల అండర్‌ 11 డబుల్స్‌లో సిల్వర్‌ ఓక్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన పూజా, మదాలస సాయి స్వర్ణం సాధించగా, బాలుర అండర్‌-13 డబుల్స్‌లో అర్బర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన ధీరజ్‌, ధర్‌షీల్‌లు విజేతలుగా నిలిచారు. క్యారమ్స్‌ SFA ఛాంపియన్‌షిప్‌లో అరంగేట్రం చేసింది. అండర్-12 విభాగంలో బాలికల సింగిల్స్‌లో మదీనా హైస్కూల్‌కు చెందిన మరియం ఖాతూన్ స్వర్ణం సాధించగా.. బాలుర అండర్-12 ఈవెంట్‌లో నిజాంపేటలోని విగ్నన్స్ బో ట్రీ స్కూల్‌కు చెందిన శ్రీకార్తీ ఇక్ష్వాక్ గెలుపొందారు.

ఇవేకాకుండా అనేక ఇతర క్రీడలు రోజంతా ఉత్సాహంగా జరిగాయి. బాస్కెట్‌బాల్ (బాలికల U-11), హ్యాండ్‌బాల్ (బాలుర U-16), వాలీబాల్ (బాలికల U-12) జట్లు తమ తమ రౌండ్‌లలో ఉత్సాహంగా ముందుకు సాగాయి. వాలీబాల్ బాలికల U-12 ఫైనల్‌లో, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ (పుప్పల్‌గూడ) విజేతగా నిలిచింది. ఇక గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్‌లో ఇది చివరి రోజు కావడంతో రేస్ వాకింగ్, ట్రాక్ ఫైనల్స్‌తో సహా అనేక ఈవెంట్‌లు జరిగాయి. బాలికల U-18లో 5000 మీటర్ల రేస్ వాకింగ్‌లో విగ్నన్స్ బో ట్రీ స్కూల్‌కు చెందిన సమితా కోలి స్వర్ణం సాధించింది. బాలుర U-16 400 మీటర్ల టైటిల్‌ను చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన హృషికేష్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. నిజాంపేట్ విఘ్నన్స్ బో ట్రీ స్కూల్ 100 పాయింట్లకు పైగా ఆధిక్యంతో తొలి స్థానంలో కొనసాగుతుంది. ఇక DDMS AMS P ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్‌ రెండవ స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఈ సంవత్సరం హైదరాబాద్ ఎడిషన్ SFA ఛాంపియన్‌షిప్స్‌లో 920 పాఠశాలల నుంచి దాదాపు 23 వేల మంది అథ్లెట్లు 22 క్రీడలలో పోటీ పడుతున్నారు. ఛాంపియన్‌షిప్‌లు అక్టోబరు 28 వరకు కొనసాగుతాయి. TV9 నెట్‌వర్క్ సహకారంతో ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్’ ఛాంపియన్‌షిప్‌ పోటీలు హైదరాబాద్ అంతటా బహుళ వేదికల ద్వారా నిర్వహిస్తున్నారు. ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లను SFA అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.