SFA Championships 2024: రసవత్తరంగా ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్’ క్రీడా పోటీలు.. 10వ రోజు హైలెట్స్ ఇవే

టీవీ 9 నెట్ వర్క్ ట్యాలెంట్ హంట్ ప్రోగ్రామ్ “ ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ ” ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్ లోని పలు స్టేడియాల్లో ఎస్ఎఫ్ఏ పోటీలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల కోసం టీవీ9 నెట్ వర్క్ బుండెస్లిగా, DFB-పోకల్, ఇండియా ఫుట్‌బాల్ సెంటర్, IFI, BVB, RIESPO వంటి ప్రముఖ సంస్థలతో జత కట్టింది. ఈ పోటీల ద్వారా ప్రతిభ గల యువ క్రీడాకారులను గుర్తించి వారికి మరింత శిక్షణ అందిస్తారు.

SFA Championships 2024: రసవత్తరంగా 'ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్' క్రీడా పోటీలు.. 10వ రోజు హైలెట్స్ ఇవే
SFA Championships 2024
Follow us

|

Updated on: Oct 25, 2024 | 4:51 PM

TV9 నెట్‌వర్క్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ “ ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ ” పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA) సహకారంతో హైదరాబాద్ వేదికగా పలు స్టేడియంలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. SFA ఛాంపియన్‌షిప్స్ 2024లో భాగంగా 10 రోజు పోటీలకు సంబంధించి విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చి బౌలి స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలు జరగ్గా.. బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన సహస్రా రెడ్డి U-14 బాలికల విభాగంలో స్వర్ణం సాధించగా, CRPF పబ్లిక్ స్కూల్‌కు చెందిన సాహిల్ పట్టాని U-18 బాలుర ఛాంపియన్‌గా నిలిచాడు. ఇక వాలీబాల్ కోర్ట్ లో విగ్నన్స్ బో ట్రీ స్కూల్ ఆధిపత్యం కొనసాగించింది. U-12 బాలుర ఫైనల్‌లో గెలిచి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. ఇక అండర్ -14 బాలికల 100 మీటర్ల బటర్ ఫ్లై స్ట్రోక్ విభాగంలోజూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన శివాని కర్రా బంగారు పతకం గెల్చుకుంది. అలాగే అండర్ -18 బాలుర 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ విజయం సాధించాడు.

ఇతర క్రీడల విషయానికి వస్తే.. ఇదే గచ్చి బౌలి మైదానంలో బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్ పోటీలు కూడా రసవత్తరంగా సాగాయి. బాస్కెట్‌బాల్ పోటీలు రెండో దశకు జరగగా, హ్యాండ్‌బాల్ పోటీలు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. . యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో, U-14, U-17 విభాగాలతో షూటింగ్ ప్రారంభం కాగా, U-14 బాలికల కబడ్డీ పోటీలు KVBR స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం హైదరాబాద్ ఎడిషన్ SFA ఛాంపియన్‌షిప్స్‌లో 920 పాఠశాలల నుండి 23,000 మంది అథ్లెట్లు 22 క్రీడలలో పోటీ పడుతున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లు అక్టోబరు 28 వరకు కొనసాగుతాయి, యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక వేదికను సృష్టించడంతోపాటు పాఠశాలలకు పతకాల పట్టికలో అగ్రగామిగా నిలిచేందుకు ఈ ట్యాలెంట్ హంట్ ప్రోగ్రామ్ అవకాశం కల్పిస్తుంది.

Sfa Championships 2024 Game

SFA Championships 2024 Games

ఇవి కూడా చదవండి

TV9 నెట్‌వర్క్ “ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్” సహకారంతో హైదరాబాద్ వేదికగా ఈ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌ల విజేతల వివరాలను SFA అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.