IND vs AUS: టీమిండియాకు బిగ్ షాక్.. యూ టర్న్ తీసుకొని రంగంలోకి రిటైర్మెంట్ ప్లేయర్..
ఉస్మాన్ ఖవాజాకు ఓపెనింగ్ భాగస్వామిపై ఆస్ట్రేలియా సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి సారిస్తున్న తరుణంలో డేవిడ్ వార్నర్ గురించి చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియన్ టెస్ట్ జట్టులో ఓపెనింగ్ స్థానం ఖాళీగా ఉంది. అక్టోబర్ ప్రారంభంలో స్టీవ్ స్మిత్ ఓపెనింగ్ చేయడని, అతని నంబర్ 4 స్థానానికి తిరిగి వస్తాడని సెలక్షన్ కమిటీ అధిపతి జార్జ్ బెయిలీ ధృవీకరించారు
David Warner Retirement Reverse Call: భారత్‌తో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చే అవకాశాన్ని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తోసిపుచ్చాడు. ఈ ఏడాది సిడ్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత వార్నర్ తన టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అతను 2024 టీ20 ప్రపంచ కప్ 2024 సమయంలో వైట్ బాల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.
టెస్టు ఫార్మాట్‌లో ఉస్మాన్ ఖవాజాకు సరిజోడి బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియాకు ఇంకా దొరకలేదు. ఇదిలా ఉండగా, భారత్‌తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు వార్నర్ తన టెస్టు రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
వార్నర్ ఏమన్నాడంటే?
సెలెక్టర్ల పిలుపును స్వీకరించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. నేను ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాను. ఫిబ్రవరిలో నా చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాను. సరైన కారణాల వల్ల రిటైరయ్యాను. అయితే నన్ను మళ్లీ జట్టులోకి తీసుకుంటే, నేను దానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. ఇలా చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గు పడడంలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. డేవ్ (వార్నర్)పై మాకు చాలా ఆసక్తి ఉంది. మేం దీన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నాం. మేg సన్నిహితంగానే ఉన్నాం. నేను కొన్ని రోజుల క్రితం డేవ్‌తో మాట్లాడాను అంటూ ప్రకటించాడు. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ నుంచి తిరిగి రావడం గురించి ఏమనుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధనమిస్తూ.. నేను సిడ్నీ థండర్‌తో ఆడటం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాను అంటూ తొసిపుచ్చాడు.
ఉస్మాన్ ఖవాజాతో ఓపెనింగ్ స్లాట్ కోసం ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌లపై చర్చల నివేదికల గురించి కూడా కమిన్స్ బహిరంగంగా మాట్లాడాడు. కమిన్స్ మాట్లాడుతూ, “ఇది ఫన్నీగా ఉంది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అని నేను కొన్ని రోజుల క్రితం చెప్పాను. హెడ్ ఓపెనింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అంటూ తేల్చేశాడు.
ఖాళీగా ఉన్న ఓపెనర్ పాత్ర కోసం ఆస్ట్రేలియా 19 ఏళ్ల న్యూ సౌత్ వేల్స్ ఓపెనర్ సామ్ కాన్స్టాస్, అనుభవజ్ఞుడైన విక్టోరియా ఓపెనర్ మార్కస్ హారిస్ వైపు చూస్తోంది. వెన్నులో ఒత్తిడి ఫ్రాక్చర్ కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను కూడా ఆస్ట్రేలియా కోల్పోనుంది.
నవంబర్ 22 నుంచి పెర్త్‌లో జరిగే మ్యాచ్‌తో ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఈసారి నాలుగు మ్యాచ్‌లు కాకుండా ఐదు మ్యాచ్‌లు జరగడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..