Vijender Singh: బాక్సింగ్ రింగ్ టు సిల్వర్ స్ర్కీన్.. సల్లూ భాయ్ సినిమాలో స్టార్ బాక్సర్..
స్టార్ బాక్సర్, ఒలింపిక్స్ పతక విజేత విజేందర్ సింగ్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కానున్నారు. విజేందర్ పుట్టినరోజు సందర్భంగా సల్మానే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తోన్న చిత్రం కిసీ కా భాయ్.. కిసీ కా జాన్. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలు విక్టరీ వెంకటేశ్, జగపతి బాబు, మాళవికా శర్మ, షెహ్‌నాజ్ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ క్యామియో రోల్‌లో సందడి చేయనున్నాడు. ఇలా ఈ ప్రాజెక్టు మొదలైన దగ్గర్నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో మరొకరు చేరారు. స్టార్ బాక్సర్, ఒలింపిక్స్ పతక విజేత విజేందర్ సింగ్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కానున్నారు. విజేందర్ పుట్టినరోజు సందర్భంగా సల్మానే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. స్టార్ బాక్సర్‌తో పాటు మరికొందరితో కలిసున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘బాక్సర్ సోదరా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు. వెల్‌కమ్ ఆన్‌బోర్డ్’ అని విజేందర్‌కు స్వాగతం పలికాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఫర్హాద్ సమ్జీ తెరకెక్కిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రంజాన్ కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
కాగా 2008 బీజింగ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో కాంస్య పతకం గెల్చుకున్నాడు విజేందర్ సింగ్. అలాగే 2009 వరల్డ్ ఛాంపియన్‌షిప్, 2010, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ మెడల్స్ గెల్చుకున్నాడు. అయితే 2015లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టారు. కాగా 2014లో విడుదలైన పుగ్లీ అనే ఓ సినిమాలో నటించాడు విజేందర్. మోహిత్, కియారా నటించిన ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. మళ్లీ ఇప్పుడు సిల్వర్‌స్ర్కీన్‌పై సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
Happy bday hamare boxer bhai @boxervijender .. welcome on board #KisiKaBhaiKisiKiJaan … @The_RaghavJuyal @siddnigam_off #JassiGill pic.twitter.com/IOsnInDZh5
— Salman Khan (@BeingSalmanKhan) October 29, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..