AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thailand Open : 2వ రౌండ్‌లో సైనా నెహ్వాల్ పరాజయం.. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన శ్రీకాంత్

సైనా నెహ్వాల్ థాయిలాండ్ ఓపెన్ రెండవ రౌండ్లో ఓటమిని చవిచూసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్ 23-21, 14-21, 16-21తో..

Thailand Open : 2వ రౌండ్‌లో సైనా నెహ్వాల్ పరాజయం.. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన శ్రీకాంత్
Rajeev Rayala
|

Updated on: Jan 14, 2021 | 10:07 PM

Share

Thailand Open : సైనా నెహ్వాల్ థాయిలాండ్ ఓపెన్ రెండవ రౌండ్లో ఓటమిని చవిచూసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్ 23-21, 14-21, 16-21తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌ చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో మెరుగ్గా రాణించిన సైనా 23-21తో ఫస్ట్‌ సెట్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండు సెట్లలో సైనా తప్పిదాలు చేయడం, ప్రపంచ 12వ ర్యాంకర్‌ బుసానన్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌ను నెగ్గింది. ఇది ప్రపంచ 12 వ నంబర్ బుసానన్ చేతిలో సైనాకు వరుసగా నాలుగో ఓటమి. ఇక పురుషుల డబుల్స్‌లో తెలుగు కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ ముందంజ వేసింది. పారుపల్లి కశ్యప్‌ గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. సమీర్‌ వర్మ 15-21, 17-21తో షెసార్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. కాలి పిక్క కండరాలు పట్టేయడంతో టోర్నీ నుంచి వైదొలిగినట్లు కిదాంబి శ్రీకాంత్‌ గురువారం ప్రకటించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21-12, 21-11తో భారత్‌కే చెందిన సౌరభ్‌ వర్మను ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి :

Samuthirakani : ‘ఆర్ఆర్ఆర్’ లో అవకాశం అలా వచ్చింది… ఆసక్తికర విషయాలు వెల్లడించిన సముద్రఖని

vakeel saab teaser : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ‘వకీల్ సాబ్’.. రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకుపోతున్న టీజర్

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?