అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి . సోమవారం (జనవరి 22) న జరిగే ఈ మహా క్రతువును కళ్లారా వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలి రానున్నారు. ఇందులో పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, ‘స్ప్రింట్ క్వీన్’ పీటీ ఉష, స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి భైచుంగ్ భూటియాతో సహా పలువురు స్టార్ ఆటగాళ్లకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రాలు అందాయి. రామ్ లాల్ ప్రాణ ప్రతిష్ట వేడుక ఆహ్వాన జాబితాలో ప్రముఖ రాజకీయ నాయకులు, నటులు, క్రీడా తారలు, వ్యాపారవేత్తలు సహా 500 మందికి పైగా ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. క్రీడా ప్రముఖుల విషయానికొస్తే.. సచిన్ టెండూల్కర్‌తో పాటు ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరితో పాటు అయోధ్య రామయ్య పిలుపు అందుకున్న క్రీడా ప్రముఖుల పూర్తి జాబితా ఇదే.
జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 21 నుంచి హైదరాబాద్‌లో చాలా మంది టీమ్ ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. మరి ఈ జాబితాలో అయోధ్యలో ఎవరు కనిపిస్తారో, ఎవరు కనిపించరు అనేది వేచి చూడాలి.
క్రికెటర్లతో పాటు వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లీశ్వరి, ఫుట్‌బాల్ క్రీడాకారిణి కళ్యాణ్ చౌబే, స్ప్రింటర్ కవితా రౌత్, పారాలింపిక్ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియాలకు కూడా ఆహ్వానాలు పంపారు. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్‌లకు కూడా ఆహ్వానం అందింది.
MS Dhoni got the invitation for the Ram Temple Pran Pratishtha at Ayodhya. pic.twitter.com/loV8rklpxF
— Johns. (@CricCrazyJohns) January 15, 2024
Mumbai: Konkan #Pranth_Pracharak Sumant Amshekhar, other functionaries gave the invitation of Pran Pratishtha Ceremony of Ayodhya Sri Ram Mandir to Bharat Ratna Sri @sachin_rt … pic.twitter.com/PktybnwYNX
— हरीश टी प्रजापति (@Harish22445) January 15, 2024
#WATCH | Madhya Pradesh | Indian cricketers Tilak Varma, Washington Sundar, Jitesh Sharma & Ravi Bishnoi attend ‘Bhasma Aarti’ performed at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/PGYyiS809h
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 14, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..