Royal Challengers Bangalore : ఆర్సీబీ జట్టులో మార్పులు.. రాయల్‌ ఛాలెంజర్స్‌ వదులుకునే ఆటగాళ్లు వీరేనా..?

ఐపీల్ 2021 కోసం బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. త్వరలోనే 14 సీజన్ కోసం వేలంపాటకుండా నిర్వహించనున్నారు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.

Royal Challengers Bangalore : ఆర్సీబీ జట్టులో మార్పులు.. రాయల్‌ ఛాలెంజర్స్‌ వదులుకునే ఆటగాళ్లు వీరేనా..?
Follow us

|

Updated on: Jan 17, 2021 | 6:03 PM

Royal Challengers Bangalore : ఐపీల్ 2021 కోసం బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. త్వరలోనే 14 సీజన్ కోసం వేలంపాటకుండా నిర్వహించనున్నారు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్కసారి కూడా కప్పు గెలవలేక పోయింది. గత సీజన్ లో విజేత అవుతుందని అభిమానులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయింది.

2021 సీజన్‌లో ఎలాగైనా కప్పు గెలవాలని ఆ ఫ్రాంఛైజీ భావిస్తోంది. అయితే ఈ సారి జట్టులో మార్పులు జరగబోతున్నాయని తెలుస్తుంది. ఫామ్ లో లేని కొంతమంది ఆటగాళ్లను వదులుకోవాలని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు భావిస్తోందట. ఐపీల్ వేలం నిర్వహించే నేపథ్యంలో జనవరి 21లోగా తమకు వద్దనుకున్న ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు విడుదల చేయాల్సి ఉంది. ఇక బెంగళూరు వదులుకోవాలనుకుంటున్న వారిలో ఉమేశ్‌ యాదవ్‌(రూ.4కోట్లు) శివమ్‌ దూబే(రూ.5కోట్లు) మొయిన్‌ అలీ(రూ.1.70కోట్లు-ఇంగ్లాండ్‌) గుర్‌కీరత్‌ మన్‌(రూ.50లక్షలు) పవన్‌ నేగీ(రూ.కోటి) ఉన్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kolkata Knight Riders : కోల్‌కతా సంచలన నిర్ణయం.. ఆ ఆటగాళ్లను నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజీ వద్దనుకుంటుందా.?