Quinton De Kock: మొదటిసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌.. కూతురికి ఏం పేరు పెట్టాడో తెలుసా?

| Edited By: Anil kumar poka

Jan 07, 2022 | 11:50 AM

దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ క్వింటన్‌ డికాక్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతని సతీమణి సాశా హర్లే గురువారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని

Quinton De Kock: మొదటిసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌.. కూతురికి ఏం పేరు పెట్టాడో తెలుసా?
Quinton De Kock
Follow us on

దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ క్వింటన్‌ డికాక్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతని సతీమణి సాశా హర్లే గురువారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని మురిసిపోయారు డికాక్‌ దంపతులు. కాగా ఆస్పత్రిలో తన కూతురుని హృదయానికి హత్తుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు డికాక్‌. ఇందులో అతని సతీమణి కూడా ఉంది. కాగా 2016లో సాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు డికాక్. అద్భుతమైన ఆటతీరుతో దక్షిణాఫ్రికా క్రికెట్‌కు వెన్నెముకగా నిలుస్తోన్న డికాక్‌ ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. సతీమణి గర్భం ధరించడంతో పాటు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికే డికాక్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

కాగా తన కూతురుకు ‘కియారా’ అని నామకరణం చేశారు డికాక్‌ దంపతులు. టీమిండియాతో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో పాల్గొన్న డికాక్‌.. ఆ మ్యాచ్ అనంతరం టెస్ట్‌ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే భారత జట్టుతో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్టులో అతనికి చోటు కల్పించింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. క్వింటన్ డికాక్ మొత్తం 54 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు. 38.82 సగటుతో 3,300 పరుగులు సాధించాడు. మొత్తంగా 6 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 141. ఇక వికెట్‌ కీపర్‌గా 221 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు కూడా చేశాడు. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడీ లెప్ట్‌ హ్యాండ్ బ్యాటర్‌.

Also Read:

Viral video: నీళ్లకు బదులు ఉమ్మితో హెయిర్‌ స్టైలింగ్‌.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

Viral video: మ్యాగీని చెడగొట్టేశారంటూ మండిపడుతున్న నెటిజన్లు.. కారణమేంటంటే..

Manchu Lakshmi: కరోన బారిన పడిన మంచువారమ్మాయి.. కలరీ స్కిల్స్‌తో వైరస్‌ను కిక్ చేస్తానంటూ పోస్ట్..