పొలార్డ్ నాకు పెద్దన్న :కృనాల్ పాండ్య
గయానా: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తనకు సోదరుడిలాంటి వాడని, జట్టు విజయంలో తన పాత్ర ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని టీమిండియా ఆటగాడు కృనాల్ పాండ్య అన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కృనాల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను అందుకున్నాడు. ‘టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో నా పాత్ర ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరింత రాణించేందుకు నేను ప్రతిరోజు కృషిచేస్తాను. ఇతర విషయాల గురించి ఆలోచించను. ఆటలో మెరుగవ్వడమే నా లక్ష్యం. పొలార్డ్ […]
గయానా: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తనకు సోదరుడిలాంటి వాడని, జట్టు విజయంలో తన పాత్ర ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని టీమిండియా ఆటగాడు కృనాల్ పాండ్య అన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కృనాల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను అందుకున్నాడు.
‘టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో నా పాత్ర ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరింత రాణించేందుకు నేను ప్రతిరోజు కృషిచేస్తాను. ఇతర విషయాల గురించి ఆలోచించను. ఆటలో మెరుగవ్వడమే నా లక్ష్యం. పొలార్డ్ నాకు సోదరుడితో సమానం. అతడి బలం నాకు తెలుసు. నా సామర్థ్యం అతడికి తెలుసు.’ అని పేర్కొన్నాడు.