ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు జైత్రయాత్ర ప్రారంభమైంది. ఆదివారం (జులై 28)న జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో తెలుగమ్మాయి అలవోకగా విజయం సాధించింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా అబ్దుల్ రజాక్ పై 21-9, 21-6 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. ఈ మ్యా చ్ లో సింధుకు రజాక్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. వరుస గేమ్‌ల్లో సింధు మ్యాచ్ ను ఫినిష్ చేసింది. కేవలం 29 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించింది. గ్రూప్ స్టేజ్‌లో బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాతో పీవీ సింధు తలపడనుంది. మరోవైపు రోయింగ్‌లోని రిఫెఛేజ్ విభాగంలో భారత అథ్లెట్ బాలరాజ్ పన్వార్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. రిఫెఛేజ్ విభాగంలో మొనాకో అథ్లెట్ క్వింటిన్ ఆంటోగ్నెల్లి ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. బాలరాజ్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. ఇక షూటింగ్ లో మనూ భాకర్ పతకం సాధిస్తుందా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తెలియనుంది.
#Olympics | In her quest for 3rd medal in the Olympics at the trot, Indian ace shuttler PV Sindhu defeats Fathimath Nabaaha Abdul Razzaq of Maldives in straight sets of 21-9 & 21-6 to clinch her first victory at #Paris2024
ఇవి కూడా చదవండి— ANI (@ANI) July 28, 2024
PV SINDHU REGISTERS A SOLID VICTORY AT THE PARIS OLYMPICS. 🏸pic.twitter.com/AzrSoOWDL8
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 28, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..