రికార్డ్ సృష్టించినా.. మారని ఫేట్!

| Edited By: Srinu

May 19, 2019 | 5:33 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు కొత్త రికార్డు సృష్టించింది. వన్డేలలో వరుసగా మూడు మ్యాచ్‌లలో 340కి పైగా స్కోర్ సాధించిన ఏకైక జట్టుగా పాక్ అవతరించింది. అయితే ఎంత చేస్తే ఏమి లాభం.. మూడు మ్యాచ్‌లలోనూ భారీ స్కోర్ చేసినా ఓటమి తప్పలేదు. దీనితో పాటు ఆ జట్టు క్రియేట్ చేసిన ఘనతను కొన్ని గంటల్లోనే ఇంగ్లాండ్ జట్టు కూడా సాధించి రెండో జట్టుగా నిలవడం విశేషం. మరోవైపు నాటింగ్‌హమ్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య […]

రికార్డ్ సృష్టించినా.. మారని ఫేట్!
Follow us on

అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు కొత్త రికార్డు సృష్టించింది. వన్డేలలో వరుసగా మూడు మ్యాచ్‌లలో 340కి పైగా స్కోర్ సాధించిన ఏకైక జట్టుగా పాక్ అవతరించింది. అయితే ఎంత చేస్తే ఏమి లాభం.. మూడు మ్యాచ్‌లలోనూ భారీ స్కోర్ చేసినా ఓటమి తప్పలేదు. దీనితో పాటు ఆ జట్టు క్రియేట్ చేసిన ఘనతను కొన్ని గంటల్లోనే ఇంగ్లాండ్ జట్టు కూడా సాధించి రెండో జట్టుగా నిలవడం విశేషం.

మరోవైపు నాటింగ్‌హమ్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య నాలుగో వన్డే జరిగింది. ఇక ఈ వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ బాబర్ అజామ్(115), ఫకార్ జమాన్(57), షోయబ్ మాలిక్(41) రాణించడంతో 50 ఓవర్లలో 7 వికెట్లకు 340 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్(114), బెన్‌స్టోక్స్(71), జేమ్స్ విన్స్(43), టామ్ కర్రన్(31) మెరుపులు మెరిపించడంతో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్ 3-0తో కైవసం చేసుకుంది.