US Open 2021: సెమీ ఫైనల్ చేరిన జొకోవిచ్.. బెరెట్టినిపై గెలిచి మరో గ్రాండ్ స్లామ్ సాధించేందుకు అడుగులు..!

ఈ ఏడాది మొత్తం మూడు గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న నొవాక్ జొకోవిచ్ ఇప్పుడు క్యాలెండర్ స్లామ్‌ను పూర్తి చేయడానికి మరింత చేరువవుతున్నాడు. అయితే, సెమీ ఫైనల్స్‌లో టోక్యోలో నొవాక్‌ను ఓడించిన ఆటగాడితో తలపడనున్నాడు.

US Open 2021: సెమీ ఫైనల్ చేరిన జొకోవిచ్.. బెరెట్టినిపై గెలిచి మరో గ్రాండ్ స్లామ్ సాధించేందుకు అడుగులు..!
Novak Djokovic
Follow us
Venkata Chari

|

Updated on: Sep 09, 2021 | 1:13 PM

Novak DJokovic: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు సెర్బియాకు చెందిన నొవాక్ జొకోవిచ్ తన ‘క్యాలెండర్ స్లామ్’ కలకి మరింత దగ్గరయ్యాడు. ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో జొకోవిచ్ మరోసారి సెమీ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో జకోవిచ్ 5-7, 6-2, 6-2, 6-3తో ఇటలీకి చెందిన మాటియో బెరెట్టినిని ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది మొత్తం మూడు గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న జకోవిచ్ క్యాలెండర్ స్లామ్ పూర్తి చేయడానికి యూఎస్ ఓపెన్ గెలవాలి. జొకోవిచ్‌తో పాటు, మహిళల సింగిల్స్‌లో, బ్రిటన్‌కు చెందిన 18 ఏళ్ల ఎమ్మా రదుక కూడా మొదటిసారి గ్రాండ్‌స్లామ్ సెమీ ఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది.

ఈ ఏడాది పురుషుల ఫైనల్ క్వార్టర్‌ఫైనల్స్‌లో జొకోవిచ్ వర్సెస్ బెరెట్టినిల మధ్య ఇది ​​వరుసగా మూడో గ్రాండ్ స్లామ్ పోరు. ప్రపంచ నంబర్ వన్ జొకోవిచ్ మూడు సార్లు గెలిచాడు. జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ గెలిచాడు. వింబుల్డన్‌ ఫైనల్‌లో ఇద్దరూ తలపడ్డారు. అక్కడ జకోవిచ్ తన 20 వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు.

వింబుల్డన్ ఫైనల్లో లాగానే, బెరెట్టిని ఈ మ్యాచులోనూ జొకోవిచ్‌పై తొలి సెట్‌ను సాధించాడు. కఠినమైన మ్యాచ్‌లో, ఇటలీకి చెందిన ఆరవ సీడ్ ప్లేయర్ జొకోవిచ్‌ను 7-5తో ఓడించాడు. కానీ, దీని తర్వాత సెర్బియా సూపర్ స్టార్ అద్భుతంగా పోరాడి, వరుస సెట్లలో మ్యాచును గెలుకున్నాడు. తరువాతి 3 సెట్లలో బెరెట్టినిని 6-2, 6-2, 6-3 తేడాతో ఓడించి సెమీ ఫైనల్‌కు టికెట్ సంపాదించాడు. సెమీ ఫైనల్స్‌లో జకోవిచ్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడతాడు. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లో జొకోవిచ్‌ను ఓడించిన జ్వెరెవ్.. స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. రెండో సెమీ ఫైనల్లో రష్యాకు చెందిన డానియల్ మెద్వెదేవ్ కెనడాకు చెందిన ఫెలిక్స్ అగెర్‌తో తలపడతాడు.

Also Read: CPL: చెత్త ఫీల్డింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లు వీరేనేమో.. కామెంట్లతో ఏకిపారేస్తోన్న నెటిజన్లు

T20 World Cup: పొట్టి ప్రపంచ కప్‌ టీంలో ధావన్‌కు ఇంకా ఛాన్స్ ఉందంటోన్న బీసీసీఐ.. మిగతా వారికి కూడా.. ఎలానో తెలుసా?

Dhoni-Kohli: ఆ విషయంలో కోహ్లీ కంటే ధోనినే బెటర్.. అందుకే టీమిండియాతో చేర్చారంటా..! అదేంటో తెలుసా?

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే