AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: పొట్టి ప్రపంచ కప్‌ టీంలో ధావన్‌కు ఇంకా ఛాన్స్ ఉందంటోన్న బీసీసీఐ.. మిగతా వారికి కూడా.. ఎలానో తెలుసా?

Shikhar Dhawan: టీ 20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాధించని కీలక ప్లేయర్ శిఖర్ ధావన్‌కు ఇంకా ఛాన్స్ ఉందంటోంది బీసీసీఐ. ధావన్‌తో పాటు మిగతా ప్లేయర్స్‌ కూడా పొట్టి ప్రపంచ కప్ టీంలో చేరే అవకాశం ఉందంట.

T20 World Cup: పొట్టి ప్రపంచ కప్‌ టీంలో ధావన్‌కు ఇంకా ఛాన్స్ ఉందంటోన్న బీసీసీఐ.. మిగతా వారికి కూడా.. ఎలానో తెలుసా?
Dhawan
Venkata Chari
|

Updated on: Sep 09, 2021 | 12:06 PM

Share

T20 World Cup: టీ 20 వరల్డ్ కప్ 2021 కోసం 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్వార్డ్‌లో స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ పేరు కనిపించలేదు. దీంతో క్రికెట్ ప్రేమికలు, మాజీలు ఎంతో ఆశ్చర్యపోయారు. అయితే శిఖర్‌ను పక్కన పెట్టడంపై బీసీసీఐ నుంచి స్పష్టమైన కారణం మాత్రం రాలేదు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ రెండు నెలల క్రితమే మెన్ ఇన్ బ్లూకి నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో పర్యటించిన జట్టుకు సారథ్యం వహించారు. అయితే, ఐసీసీ నిర్వహించే పొట్టి ప్రపంచ కప్‌ విషయానికి వచ్చినప్పుడు మాత్రం బీసీసీఐ శిఖర్ పేరును స్వార్డ్‌లో చేర్చలేదు.

2013 నుంచి జట్టులో శిఖర్ ధావన్ రెగ్యులర్ సభ్యుడిగా ఉంటూ వస్తున్నాడు. గత రెండు సంవత్సరాలుగా టీ 20ల్లో ధావన్ విఫలమవుతున్నాడు. కానీ, ఐపీఎల్‌లో మాత్రం దంచి కొడుతున్నాడు. అయితే, జట్టులో అత్యంత సీనియర్ ఓపెనర్ లేకుండా ఒక ఐసీసీ ఈవెంట్‌లో భారత్ పాల్గొనడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.

జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లో ఇద్దరు ఓపెనర్లు మాత్రమే ఉన్నారు. అయితే ధావన్ స్థానంలో ఇషాన్ కిషన్ పేరును చేర్చారు. శ్రేయస్ అయ్యర్ రూపంలో మరో ప్లేయర్‌ను కూడా స్వార్డ్‌లో చేర్చాడు. జట్టు ఎంపిక తర్వాత మీడియాతో మాట్లాడిన చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ.. ధావన్ ఇంకా మా పరిశీలనలో ఉన్నాడని పేర్కరొన్నాడు.

“శిఖర్ మాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. సమావేశంలో ఏం జరిగిందనేది బయటకు చెప్పడం కుదరదు. ధావన్ ఇంకా లిస్టులోనే ఉన్నాడు. ప్రస్తుతానికి ధావన్‌కు విశ్రాంతి అవసరమని భావించాం” అని పేర్కొన్నారు.

ఇప్పటికే తన భార్యతో విడాకులు తీసుకున్న ధావన్‌.. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్‌ టీంలో సెలక్ట్ కావపోవడంతో.. అంతా ఆయన టీ20 కెరీర్ ముగిసిందంటూ మాట్లాడుతున్నారు. చేతన్ శర్మ మాటలతో శిఖర్ ధావన్ తిరిగి జట్టులో చేరతాడనే విషయం తెలుస్తోంది. అయితే ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా..? ఖచ్చితంగా సాధ్యమే..!

2021 టీ 20 వరల్డ్ కప్ కోసం భారత్.. 15 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీసీ నూతనంగా చేసిన మార్పులతో టీ20 వరల్డ్ కప్ స్వార్డ్‌లో ఎలాంటి మార్పులైనా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకటించిన జట్టులో అక్టోబర్ 10 వరకు మార్పులు చేయవచ్చు. యూఏఈలో సెప్టెంబర్ 19 న ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో వారి ప్రదర్శనను బట్టి ఆటగాళ్లను భర్తీ చేసుకునే ఛాన్స్ ఆయా దేశాలకు ఉంది. ఐపీఎల్ టోర్నమెంట్ అక్టోబర్ 8 న ముగుస్తుంది. దీంతో అక్టోబర్ 10 వరకు మార్పులు చేసుకోవచ్చని ఐసీసీ తెలిపింది.

ధావన్‌తో పాటు, యుజ్వేంద్ర చాహల్ వంటి కీలక ప్లేయర్లు కూడా టీ20 జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న 15 మంది సభ్యులలో ఎవరైనా రాణించకపోతే.. వారిస్థానంలో మరికొంతమందిని తీసుకునే అవకాశం ఉంది.

ధావన్ యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 2020 లో 44.14 సగటుతో 618 పరుగులు చేశాడు. ధావన్ కాకుండా, పృథ్వీ షా కూడా టీ20 ప్రపంచ కప్‌లో చోటు దక్కకపోవడంతో కలత చెంది ఉండవచ్చు. పృథ్వీ షాతో కలిసి ధావన్ ఐపీఎల్‌లో వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. మంచి ఫాంలో ఉన్న షా సెలక్ట్ కాకపోవడం గమనార్హం.

సెలెక్టర్లు జట్టును పూర్తిగా మార్చాలని భావించకపోవచ్చు. కానీ, ఐసీసీ సూచించిన నియమాల ప్రకారం పనితీరును బట్టి ఒకటి లేదా రెండు మార్పులు చేసుకునే అవకాశం ఉంది.

Also Read:

Dhoni-Kohli: ఆ విషయంలో కోహ్లీ కంటే ధోనినే బెటర్.. అందుకే టీమిండియాతో చేర్చారంటా..! అదేంటో తెలుసా?

T20 World Cup: ధావన్ స్థానాన్ని భర్తీ చేసేది ఆ స్టార్ ప్లేయర్.. రోహిత్ శర్మతో ఓపెనింగ్ కూడా.?

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..