జులై 1 నుంచి 10 వరకు జరిగే లీగ్‌లో టైటిల్ కోసం ఎనిమిది జట్లు తలపడతాయి. ఈ ఎనిమిది జట్లు - బెంగళూరు లయన్స్, మంగళూరు షార్క్స్, మాండ్య బుల్స్, మైసూర్ పాంథర్స్, మల్నాడ్ ఫాల్కన్స్, బందీపూర్ టస్కర్స్, కెజిఎఫ్ వోల్వ్స్, కొడగు టైగర్స్. ఒక్కొక్క టీంలో 10 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇందులో కనీసం ఐదుగురు కర్ణాటక ఆటగాళ్లు ఉంటారు. వీరిలో ఇద్దరు క్రీడాకారులు విదేశాలకు చెందిన వారు కాగా, ముగ్గురు మహిళలు షట్లర్లకు చోటు దక్కనుంది.