Super League Kerala: సరికొత్త ఫుట్‌బాల్ చరిత్రకు సిద్ధమైన భారత్.. ఘనంగా మొదలైన సూపర్ లీగ్ కేరళ..

|

Sep 10, 2024 | 8:36 PM

Super League Kerala: సెప్టెంబరు 7, 2024 శనివారం నాడు కొచ్చిలోని ఐకానిక్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సూపర్ లీగ్ కేరళ (ఎస్‌ఎల్‌కే) తొలి సీజన్‌ను ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఫోర్కా కొచ్చి ఎఫ్‌సీ వర్సెస్ మలప్పురం ఎఫ్‌సీల మధ్య ఉత్కంఠభరితమైన పోరుతో ఈ సీజన్ షురువైంది. ఈ ప్రారంభ వేడుకలో సుప్రసిద్ధ సూపర్ లీగ్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు, క్లబ్ ప్రొప్రైటర్లు పృథ్వీరాజ్, ఆసిఫ్ అలీతో పాటు పలువురు ప్రముఖ అతిథులు హాజరయ్యారు.

Super League Kerala: సరికొత్త ఫుట్‌బాల్ చరిత్రకు సిద్ధమైన భారత్.. ఘనంగా మొదలైన సూపర్ లీగ్ కేరళ..
Super League Kerala
Follow us on

Super League Kerala: సెప్టెంబరు 7, 2024 శనివారం నాడు కొచ్చిలోని ఐకానిక్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సూపర్ లీగ్ కేరళ (ఎస్‌ఎల్‌కే) తొలి సీజన్‌ను ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఫోర్కా కొచ్చి ఎఫ్‌సీ వర్సెస్ మలప్పురం ఎఫ్‌సీల మధ్య ఉత్కంఠభరితమైన పోరుతో ఈ సీజన్ షురువైంది. ఈ ప్రారంభ వేడుకలో సుప్రసిద్ధ సూపర్ లీగ్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు, క్లబ్ ప్రొప్రైటర్లు పృథ్వీరాజ్, ఆసిఫ్ అలీతో పాటు పలువురు ప్రముఖ అతిథులు హాజరయ్యారు. ప్రారంభ మ్యాచ్ ఉత్కంఠ, ఉత్సాహంతో నిండిపోయింది. మలప్పురం FC 2-0తో ఫోర్కా కొచ్చి FCపై విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక టోర్నమెంట్‌కు అద్భుతమైన ఆరంభాన్ని అందించింది.

ప్రారంభోత్సవ వేడుకలు కూడా అద్భుతంగా సాగాయి. బాలీవుడ్ ప్రముఖ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంగీత విద్వాంసులు స్టీఫన్ దేవస్సీ, శివమణి, డాబ్జీ, డీజే సావ్యో, డీజే శేఖర్‌లు హోరెత్తించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆరు ఫ్రాంచైజీలను కలిగి ఉన్న సూపర్ లీగ్ కేరళ, కేరళలో ఫుట్‌బాల్‌పై మక్కువను మళ్లీ పెంచాలని ఆకాంక్షిస్తోంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్‌లతో పాటు స్థానిక ప్రతిభావంతులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేదికను అందించడం ద్వారా, ఈ ప్రాంతంలో క్రీడల వృద్ధిని ప్రోత్సహించడం లీగ్ లక్ష్యం. కొచ్చి, కోజికోడ్, మలప్పురం, తిరువనంతపురం వంటి నాలుగు వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక స్పాన్సర్‌షిప్ విషయానికి వస్తే మహీంద్రా పనిచేయనుంది. మహీంద్రా సూపర్ లీగ్ కేరళ పేరుతో, SLK ఒక ప్రొఫెషనల్ పురుషుల ఫుట్‌బాల్ లీగ్‌గా పనిచేస్తుంది. ఇది ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ సిస్టమ్ నుంచి స్వతంత్రంగా ఉంటుంది.లీగ్ తొలి సీజన్ సెప్టెంబర్ 7, 2024న ప్రారంభమైంది. రాష్ట్ర ఫుట్‌బాల్ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.

సూపర్ లీగ్ కేరళ తొలి మ్యాచ్ వీడియో..

కేరళకు చెందిన 100 మంది యువ ఫుట్‌బాల్ క్రీడాకారులను SLK జట్టు యజమానులు ప్రపంచ-స్థాయి శిక్షణ, పోటీ అనుభవాలకు అసమానమైన ఎక్స్‌పోజర్‌ని పొందేందుకు ఎంపిక చేశారు. భారతీయ, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో కెరీర్‌లకు తలుపులు తెరిచినట్లైంది.

సూపర్ లీగ్ కేరళ క్రీడలు, వినోదం, రిటైల్, పర్యాటకం, ఆతిథ్యంతో సహా వివిధ రంగాలలో ముఖ్యమైన అవకాశాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ పరిణామాలు కేవలం ఆరు ఫ్రాంచైజీ ప్రాంతాలకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ప్రయోజనం చేకూర్చగలవని, తద్వారా కేరళ సామాజిక-ఆర్థికంగా బలపరుస్తుందని భావిస్తున్నారు.

SLK లక్ష్యం స్పష్టంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేరళ ఫుట్‌బాల్ సంస్కృతిని పునర్నిర్వచించడం, రాష్ట్రం నుంచి అభివృద్ధి చెందుతున్న ప్రతిభకు వేదికను అందించడం, అదే సమయంలో ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా అంతటా ఫుట్‌బాల్‌ను ఇష్టపడే ప్రాంతాల నుంచి క్రీడాకారులు, ఔత్సాహికులను ఆకర్షిస్తుంది. ఇటువంటి ప్రతిష్టాత్మక లక్ష్యాలతో, ఫుట్‌బాల్ నైపుణ్యం కొత్త శకానికి నాంది పలికి, కేరళ క్రీడా భవిష్యత్తుపై లీగ్ చెరగని ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..