Stop Your Humiliating: హిజాబ్(hijab) పై బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల (Gutta Jwala) సంచలన ట్వీట్ చేశారు. మీ రాజకీయాలు ఆపండి అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిజాబ్ వివాదంపై గుత్తా జ్వాల సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. చిన్న బాలికలను పాఠశాల గేట్ల వద్ద అవమానించడం మానేయండి అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నరు. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చిన్న బాలికలను పాఠశాల గేట్ల వద్ద అవమానించడం మానేయండి. అక్కడికి వారు తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారు. పాఠశాల వారి సురక్షిత స్వర్గంగా భావించబడుతుంది. ఈ నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి’ అంటూ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ పేర్కొన్నారు.
Stop humiliating small girls at the gates of the school where they come to empower themselves…school is supposed to be their safe haven!!
Head scarf or no head scarf
Spare them from this ugly politics….stop scarring there small minds ????
Just stop this!! ?— Gutta Jwala (@Guttajwala) February 15, 2022
కర్నాటకలో హిజాబ్ వివాదంపై రగడ ఇప్పట్లో చల్లారే అవకాశం లేదు. మాండ్య లోని రోటరీక్లబ్ స్కూళ్లో హిజాబ్‌పై మళ్లీ గొడవ జరిగింది. కొందరు పేరంట్స్ తమ పిల్లలను హిజాబ్‌తో స్కూల్‌కు తీసుకురావడంతో టీచర్లు అభ్యంతరం చెప్పారు. హిజాబ్ తీసేస్తేనే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.
అయితే టీచర్లతో పేరంట్స్ వాగ్వాదానికి దిగారు. క్లాస్‌రూమ్‌ల వరకు తమ పిల్లలు హిజాబ్‌తో వస్తారని స్పష్టం చేశారు. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కొందరు టీచర్లు కూడా హిజాబ్‌తో స్కూళ్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా యాజమాన్యం అభ్యంతరం చెప్పింది.
మరోవైపు ఈ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దీనిపై కర్నాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాడివేడి వాదనలు సాగాయి. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించాలని ఖురాన్‌లో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
హిజాబ్‌ను నిషేధిస్తూ చట్టం ఎక్కడుందని త్రిసభ్య ధర్మాసనం ముందు పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. డ్రెస్‌కోడ్ పేరుతో కర్నాటక ప్రభుత్వం హక్కులను హరిస్తోందని వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టులో వాదనలు ఇవాళ కూడా జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి: Joint Pains – Yoga: కీళ్ల నొప్పులకు చక్కని ఉపశమనం.. ఇంట్లోనే ఇలా చేయండి చాలా.. మీ నొప్పులు మాయం..
Skin Care Tips: బాదం నూనె ఉపయోగిస్తే నిత్య యవ్వనం.. ముడుతలు లేని మెరిసే చర్మం మీసొంతం!