Mirabai Chanu: మీరాబాయి చానుకు క్యూ కడుతున్న రివార్డులు.. కారును ప్రజెంట్ చేసిన రెనాల్ట్ ఇండియా
అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారతీయులు గర్వపడేలా నిలబెట్టిన ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చానును దేశంలోని ప్రముఖ కంపెనీల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నిన్న ప్రముఖ న్యూట్రిలైట్...
అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారతీయులు గర్వపడేలా నిలబెట్టిన ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చానును దేశంలోని ప్రముఖ కంపెనీల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నిన్న ప్రముఖ న్యూట్రిలైట్ కంపెనీ ఆమ్‌వే ఇండియా తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా చానును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రెనాల్ట్ కిగర్ కంపెనీ తమ హై ఎండ్ కారును బహుమతిగా అందించారు. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ లో 26 ఏళ్ల చాను మహిళల 49 కిలోల విభాగంలో 204 కిలోల (87 కిలోల+115 కిలోలు) విభాగంలో రజత పతకాన్ని సాధించడంతో దేశమంతా సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ తర్వాత ఆమెకు భారీ స్థాయిలో అవార్డులు, రివార్డులు క్యూ కట్టాయి.
రెనాల్ట్ కిగర్.. ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా తమ కొత్త కిగర్ ఎస్‌యూవీ మోడల్ ని భారత మార్కెట్లోకి దూసుకుపోతోంది. ఈ వాహనాన్ని 2021 జనవరి 28న ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో క్విడ్, ట్రైబర్ల తర్వాత ఈ మోడల్ గ్లోబల్ మార్కెట్లో లభ్యమవుతోంది.
భారత కస్టమర్ల కోసం ఫ్రాన్స్ బృందాల సహకారంతో ఈ నూతన ఎస్‌యూవీని అభివృద్ధి చేశారు. భారత కస్టమర్ల అభిరుచికి తగ్గట్లు ఆధునిక ఫీచర్లతో దీన్ని రూపొందించామని, ఇది స్పోర్టీ వరల్డ్ క్లాస్ ఇంజిన్ తో ఆకట్టుకుంటుందని కంపెనీ పేర్కొంది.
కాగా, ఈ ఎస్‌యూవీ మోడల్ నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్ క్యూవీ 300, మారుతీ సుజుకి విటారా బ్రెజాలకు కిగర్ గట్టి పోటీగా నిలువనుంది.
ఇవి కూడా చదవండి: Afghanistan Crisis: యాక్షన్.. రియాక్షన్.. తాలిబన్ల చెర నుంచి మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ సైన్యం