PKL 2023: తెలుగు టైటాన్స్‌కు భారీ షాక్.. 10వ సీజన్‌ నుంచి యువ రైడర్ ఔట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన అన్‌సోల్డ్ ప్లేయర్..

|

Dec 02, 2023 | 12:13 PM

Telugu Titans PKL 10: ప్రొ కబడ్డీ 2023 కోసం వినయ్ రెధూని తెలుగు టైటాన్స్ కొనసాగించింది. పీకేఎల్ 9వ సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 42 పాయింట్లు సాధించాడు. కాగా, ఈ సీజన్‌లో పవన్‌, వినయ్‌ల జోడీ మాయాజాలం చూస్తుందని భావించారు. అయితే, ప్రాక్టీస్‌లో మోకాలి గాయం కారణంగా వినయ్‌, తెలుగు టైటాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

PKL 2023: తెలుగు టైటాన్స్‌కు భారీ షాక్.. 10వ సీజన్‌ నుంచి యువ రైడర్ ఔట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన అన్‌సోల్డ్ ప్లేయర్..
Sandeep Dhull Replaces Inju
Follow us on

Pro Kabaddi 2023: ప్రొ కబడ్డీ 2023 (Pro Kabaddi 2023) ప్రారంభానికి ముందు తెలుగు టైటాన్స్‌(Telugu Titans)కు పెద్ద దెబ్బ తగిలింది. యువ రైడర్ వినయ్ రెధూ (Vinay Redhu) మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో వేలంలో అమ్ముడవ్వని సందీప్ ధుల్‌ (Sandeep Dhull)ను భర్తీ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తెలుగు టైటాన్స్ ఈ విషయాన్ని ప్రకటించింది.

“వినయ్ రెడ్డు ప్రాక్టీస్ సమయంలో గాయం కారణంగా PKL 10వ సీజన్‌కు దూరమయ్యాడు. అతను త్వరగా కోలుకుంటాడని మేం ఆశిస్తున్నాం. అతని స్థానంలో డిఫెండర్ సందీప్ ధుల్‌ని జట్టులోకి తీసుకుంటాం” అని ప్రకటించారు.

ప్రొ కబడ్డీ 2023 కోసం వినయ్ రెధూని తెలుగు టైటాన్స్ కొనసాగించింది. పీకేఎల్ 9వ సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 42 పాయింట్లు సాధించాడు. కాగా, ఈ సీజన్‌లో పవన్‌, వినయ్‌ల జోడీ మాయాజాలం చూస్తుందని భావించారు. అయితే, ప్రాక్టీస్‌లో మోకాలి గాయం కారణంగా వినయ్‌, తెలుగు టైటాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

అతని స్థానంలో జట్టులోకి వచ్చిన సందీప్ ధుల్ గత సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ KCలో భాగంగా ఉన్నాడు. వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయితే, రాబోయే సీజన్ కోసం విడుదల అయ్యాడు. కానీ, వేలంలో ఏ జట్టు అతన్ని కొనుగోలు చేయలేదు. అతను అమ్ముడుపోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ, ఇప్పుడు సందీప్ ధుల్‌కి ఖచ్చితంగా పెద్ద అవకాశం వచ్చింది. అతని రాక ఖచ్చితంగా తెలుగు టైటాన్స్ ఢిపెన్స్‌ను బలోపేతం చేస్తుంది.

ప్రొ కబడ్డీ 2023లో పవన్ సెహ్రావత్‌పై తెలుగు టైటాన్స్ భారీ అంచనాలు..

ప్రొ కబడ్డీ 2023 వేలంలో పవన్ కుమార్ సెహ్రావత్‌ను రూ. 2.605 కోట్లకు తెలుగు టైటాన్స్ కొనుగోలు చేసింది. అతను ఈ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా కూడా మారాడు. తెలుగు టైటాన్స్ కూడా అతనిని రాబోయే సీజన్‌కు కెప్టెన్‌గా చేసింది. టైటాన్స్ జట్టు ఇప్పటి వరకు ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. గత కొన్ని సీజన్లలో ఆ జట్టు ప్లే-ఆఫ్‌కు కూడా అర్హత సాధించలేదు.

ఈ మేరకు కెప్టెన్ పవన్‌పై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, హైఫ్లైయర్ తెలుగు టైటిల్ కరువును దూరం చేస్తుందని భావిస్తున్నారు. పవన్ కూడా టీమ్‌కి మెయిన్ రైడర్‌గా ఉండబోతున్నాడు. అతను బాగా రాణిస్తే ఖచ్చితంగా జట్టుకు మంచి అవకాశాలు పెరుగుతాయి.

ప్రొ కబడ్డీ 2023లో పవన్‌తో పాటు రజనీష్, పర్వేష్ భైన్‌వాల్, సందీప్ ధుల్‌లపై కూడా తెలుగు టైటాన్స్ భారీ ఆశలు పెట్టుకుంది. డిసెంబర్ 2న గుజరాత్ జెయింట్స్‌పై తమ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..