AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పారాలింపిక్స్ పతక విజేతలతో ప్రధాని.. మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అవనీ లేఖరా.. అదేంటో తెలుసా?

టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు, 2022 ఆసియా పారా గేమ్స్‌లో 111 పతకాలు సాధించిన భారత పారాలింపిక్ క్రీడాకారులు ఈసారి పారిస్‌లో హ్యాట్రిక్ సాధించారు. రెండు సందర్భాల్లో, భారత ఒలింపిక్ బృందం టోక్యోలో 7 పతకాలు, గత ఆసియా క్రీడలలో 107 పతకాలను గెలుచుకుంది. భారత ఒలింపిక్ బృందం కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు చూపిస్తుంది.

PM Modi: పారాలింపిక్స్ పతక విజేతలతో ప్రధాని.. మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అవనీ లేఖరా.. అదేంటో తెలుసా?
Pm Modi Avani Lekhara
Venkata Chari
|

Updated on: Sep 12, 2024 | 3:37 PM

Share

PM Narendra Modi Meet With India Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో పాల్గొన్న క్రీడాకారులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పారాలింపియన్లందరినీ ప్రధానమంత్రి తన నివాసానికి పిలిచారు. ఇక్కడ ప్రధానమంత్రి ఆటగాళ్లందరితో ఒక్కొక్కరితో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. గంటకు పైగా జరిగిన సమావేశంలో ప్యారా అథ్లెట్‌ల విజయగాథలను వింటూ ప్రధాని మోదీ అందరితో సంభాషించారు. చారిత్రాత్మక పారాలింపిక్స్ ప్రచారంలో భారత్ 29 పతకాలను గెలుచుకుంది. 2021లో టోక్యో (19) తర్వాత అత్యుత్తమ పతకాలను మెరుగుపరుచుకుంది.

పారిస్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్‌లో బంగారు పతకాన్ని దక్కించుకున్న షూటర్ అవనీ లేఖరా, ప్రధాని మోదీకి సంతకం చేసిన టీ షర్ట్‌ను బహుమతిగా ఇచ్చింది. ప్రధానికి బహూకరించిన టీషర్ట్ వెనుక ‘మీ మద్దతుకు, ధన్యవాదాలు సార్’ అని రాసి ఉంది. పారాలింపియన్‌లను అభినందించి, విజేతలతో ఫొటోలు దిగుతూ ప్రధాని మోదీ కూడా మెడల్స్‌పై సంతకం చేయడం కనిపించింది.

4 రోజుల క్రితం సెప్టెంబర్ 8న పారిస్ వేదికగా ముగిసిన క్రీడల్లో భారత్ 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో సహా 29 పతకాలు సాధించింది. మొదటిసారిగా, భారతదేశం పారా-గేమ్స్ పతకాల పట్టికలో టాప్-20లో చేర్చింది. ఇందులో భారతదేశం 18వ స్థానానికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

2 రోజుల క్రితం క్రీడా మంత్రిత్వ శాఖ..

పారాలింపిక్స్ పతక విజేతలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సన్మానించింది. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు రూ.75 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.50 లక్షలు, కాంస్యం సాధించిన పారా ప్లేయర్లకు రూ.30 లక్షలు అందజేశారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన ఆర్చర్ శీతల్ దేవికి అదనంగా రూ.22.5 లక్షలు ఇచ్చారు.

స్పెషల్ హ్యాట్రిక్ సాధించిన భారత్..

టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు, 2022 ఆసియా పారా గేమ్స్‌లో 111 పతకాలు సాధించిన భారత పారాలింపిక్ క్రీడాకారులు ఈసారి పారిస్‌లో హ్యాట్రిక్ సాధించారు. రెండు సందర్భాల్లో, భారత ఒలింపిక్ బృందం టోక్యోలో 7 పతకాలు, గత ఆసియా క్రీడలలో 107 పతకాలను గెలుచుకుంది. భారత ఒలింపిక్ బృందం కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు చూపిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..