AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ ఖాతాలో మరో పతకం.. ఒకే ఒలింపిక్స్‌లో 2 మెడల్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించిన మను భాకర్..

పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఆమె పిస్టల్ నుంచి పేల్చిన బుల్లెట్ భారత్‌కు మరో పతకం సాధించడంలో సహాయపడింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 2కి పెరిగింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా కూడా మను భాకర్ నిలిచింది. మను భాకర్ తన భాగస్వామి సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భారత్‌కు రెండో పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో మను-సరబ్‌జోత్ 16-10తో కొరియా జోడీని ఓడించారు.

భారత్ ఖాతాలో మరో పతకం.. ఒకే ఒలింపిక్స్‌లో 2 మెడల్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించిన మను భాకర్..
Manu Bhaker And Sarabjot Singh
Venkata Chari
|

Updated on: Jul 30, 2024 | 1:35 PM

Share

Manu Bhaker – Sarabjot Singh: పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఆమె పిస్టల్ నుంచి పేల్చిన బుల్లెట్ భారత్‌కు మరో పతకం సాధించడంలో సహాయపడింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 2కి పెరిగింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా కూడా మను భాకర్ నిలిచింది. మను భాకర్ తన భాగస్వామి సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భారత్‌కు రెండో పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో మను-సరబ్‌జోత్ 16-10తో కొరియా జోడీని ఓడించారు.

ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డ్..

అంతకుముందు, జులై 28న పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని అందుకుంది. పారిస్‌లో సాధించిన తొలి కాంస్యంతో మను పతకాల పట్టికలో భారత్‌ ఖాతా తెరిచింది. పారిస్‌లో తొలి విజయం సాధించిన 48 గంటల తర్వాత ఇప్పుడు మను భాకర్ మరో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది.

పారిస్‌లో మను-సర్బ్‌జోత్ జోడీ అద్భుతం..

జులై 29న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక మ్యాచ్‌కు మను భాకర్, సరబ్జోత్ సింగ్ అర్హత సాధించారు. వీరిద్దరూ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 20 పర్ఫెక్ట్ షాట్‌లు చేసి 580 పాయింట్లు సాధించారు.

టోక్యో వైఫల్యానికి పారిస్‌లో చెక్ పెట్టేసిన మను భాకర్..

మను భాకర్ పారిస్‌లో రెండో ఒలింపిక్స్ ఆడుతోంది. అంతకుముందు ఆమె టోక్యోలో ఒలింపిక్ అరంగేట్రం చేసింది. అక్కడ ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది. టోక్యోలో మను భాకర్ వైఫల్యానికి కారణం ఆమె పేలవమైన ఆట కాదు. తన పిస్టల్‌లో సాంకేతిక లోపంతో విఫలమైంది. టోక్యోలో వైఫల్యం తర్వాత, మను చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ, మను భాకర్ పారిస్ నుంచి ఖాళీ చేతులతో తిరిగి రాకపోవడం విశేషం. తనతో పాటు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతక ఖాతా తెరిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..