తమిళనాట జోరుగా జల్లికట్టు పోటీలు, రక్తమోడుతున్నా వెనక్కి తగ్గని వైనం, చెట్టిపాలయంలో ప్రారంభించిన మంత్రి వేలుమణి

|

Feb 21, 2021 | 11:38 AM

తమిళనాడులో సాంప్రదాయ జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో రక్తమోడుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా ఔత్సాహిక..

తమిళనాట జోరుగా జల్లికట్టు పోటీలు, రక్తమోడుతున్నా వెనక్కి తగ్గని వైనం, చెట్టిపాలయంలో ప్రారంభించిన మంత్రి వేలుమణి
Follow us on

తమిళనాడులో సాంప్రదాయ జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో రక్తమోడుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా ఔత్సాహిక యువకులు చెన్నై కోయంబత్తూర్‌ తదితర ప్రాంతాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నిర్వాహకులు ఆంక్షలను బేఖాతరు చేసి మరీ పోటీలు నిర్వహిస్తూనే ఉన్నారు. చెట్టిపాలయంలో జల్లికట్టు పోటీలను ప్రారంభించారు మంత్రి వేలుమణి. ఈ పోటీల్లో వెయ్యి ఎద్దులు, 750 మంది యువకులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో 14 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జల్లికట్టు పోటీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. భారీగా అంబులెన్స్ లు అందుబాటలో ఉంచారు.

Read also :

ఆమె నుదిటి బొట్టు టాక్ ఆఫ్ ద వరల్డ్, భారత సంతతి నాసా సైంటిస్ట్ స్వాతి మోహన్ చూపు.. శైలి అన్నీ సూపర్ అట్రాక్షన్

లాయర్ దంపతుల హత్య నేపథ్యం : గుంజపడుగు బయల్దేరిన బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు, దగ్గరుండి పంపించిన రాజాసింగ్