ISSF World Cup: ప్రపంచ కంప్ షూటింగ్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే మూడు స్వర్ణాలు సాధించిన ఇండియా ఖాతాలోకి మరో స్వర్ణ పథకం వచ్చి చేరింది. దాంతో పాటు, సిల్వర్, రజతం పతకాలు కూడా వచ్చాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో చింకీ యాదవ్ స్వర్ణం గెలుచుకుంది. ఇక రాహి సర్నబోత్ సిల్వర్ మెడల్‌ను సాధించగా.. మను భాకర్ రజతం గెలుచుకుంది. ఇదిలాఉంటే.. అంతకు ముందు.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైన్‌లో ఇలవేనిల్-దిశ్యాంశ్ జోడీ పసిడి పతకాన్ని సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైన్‌లో మనూ భాకర్-సౌరభ్ చౌదరి జోడీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక పురుషుల స్కీట్ ఈవెంట్ ఫైనలలో అంగద్ వీర్‌బజ్వా, గుర్జోత్, మేరాజ్ అహ్మద్ ఖాన్‌లతో కూడిన ఇండియన్ టీమ్.. ఖతర్ టీమ్‌పై గెలుపొంది స్వర్ణ పతకాన్ని సాధించింది. కాగా, సౌరభ్ చౌధురి, అభిషేక్ వర్మ, షహజార్ రిజ్వీ త్రయం పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో పసిడి పతకం కైవసం చేసుకున్నది. ఇక ఐశ్వర్య ప్రతాప్ సింగ్, దీపక్ కుమార్, పంక్ కుమార్‌తో కూడిన భారత జట్టు పురుషుల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం గెలుపొందింది.
Also read:
AIADMK Party: శశికళ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకేలో తీవ్ర కలకలం..