భారత బాక్సర్ల విమానం దిగేందుకు నో చెప్పిన దుబాయ్.. గాలిలోనే 45 నిమిషాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Indian Boxing Contingent: ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ పోటీల కోసం భారత బాక్సర్ల జట్టు దుబాయ్ చేరుకుంది. అయితే వీరిని చేరవేసిన విమానం ల్యాండిగ్‌కు దుబాయ్ విమానాశ్రయ అధికారులు ముందుగా అనుమతి ఇవ్వలేదు.
ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ పోటీల కోసం భారత బాక్సర్ల జట్టు దుబాయ్ చేరుకుంది. అయితే వీరిని చేరవేసిన విమానం ల్యాండిగ్‌కు దుబాయ్ విమానాశ్రయ అధికారులు ముందుగా అనుమతి ఇవ్వలేదు. దీంతో విమానం 45 నిమిషాల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఈ మొత్తం ఘటనపై విచారణ జరపాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది.
కరోనా నిబంధనల నేపథ్యంలో బాక్సర్లు ప్రయాణించడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చింది యూఏఈ సర్కార్. దీంతో భారత బాక్సర్లు మేరీకోమ్‌తో పాటు 30 మంది బృందం స్పైస్‌జెట్ విమానంలో దుబాయ్‌కు చేరుకున్నారు. అయితే సమాచార లోపంతో యూఏఈ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్‌కు అనుమతించలేదు. అక్కడి అధికారులు వివరణ ఇచ్చారు. అడ్డుకోవడానకి కారణం ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించడమే కారణమని తాజాగా స్పష్టం చేశారు.