Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఒక్కసారిగా ధరలు పతనం.. సోమవారం తులం ఎంతంటే..?
బంగారం, వెండి ధరలపై గుడ్ న్యూస్. ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రెండ్రోజుల పెరుగుదలకు ఇవాళ బ్రేక్ పడింది. వారం ప్రారంభంలోనే ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు ఉపశమనం లభించింది. పండుగ సీజన్ క్రమంలో గత కొద్ది రోజులుగా ధరలు పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అయ్యారు.

బంగారం కొనుగోలుచేసేవారికి భారీ ఊరట కలిగింది. ధరలు గత రెండ్రోజులుగా భారీగా పెరగ్గా.. సోమవారం ఒక్కసారిగా బ్రేక్ పడింది. అక్టోబర్ 12న ధరలు ఒక్కసారిగా శాంతించాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడం, పండుగ క్రమంలో గోల్డ్ కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ధరలు పతనం కావడం కాస్త ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు. గత రెండ్రోజులుగా ధరలు పెరగడంతో.. రానున్న రోజుల్లో కూడా పెరుగుతాయనే అంచనాలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు తగ్గడం కాస్త ఊరటను కల్గిస్తోంది. త్వరలో దసరా, దీపావళి లాంటి పెద్ద పండుగలు వస్తుండంతో బంగారానికి డిమాండ్ పెరగనుంది. ఇలాంటి తరుణంలో ధరలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. అటు పెట్టుబడిదారుల్లోనూ బంగారం ధరలపై ఆసక్తి నెలకొని ఉంది. సోమవారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.
ఇవాల్టీ బంగారం ధరలు ఇవే..
-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,410 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,790గా ట్రేడవుతోంది.
-హైదరాబాద్‌లో24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,51,410గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,790 వద్ద ట్రేడవుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,410 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,790 వద్ద కొనసాగుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,51,410గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,790 వద్ద ట్రేడవుతోంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,51,560 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,940గా కొనసాగుతోంది.
సిల్వర్ ధరలు ఇలా..
-దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,39,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.2.40 లక్షలుగా ఉంది.
-హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు రూ.2,44,900గా ప్రస్తుతం ట్రేడవుతోంది. నిన్న ఈ రేటు రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది.
-చెన్నైలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.
-బెంగళూరులో కిలో సిల్వర్ రేటు రూ.2,39,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.2.40 లక్షల వద్ద ట్రేడవుతోంది.
