India Open 2022: రౌండో రౌండ్లో సైనా నెహ్వాల్ ఓటమి.. క్వార్టర్ ఫైనల్‌ చేరిన పీవీ సింధు..!

|

Jan 13, 2022 | 4:17 PM

Saina Nehwal: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ద్వారా సైనా నెహ్వాల్ చాలా కాలం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టింది. అయితే కొత్త సంవత్సరం ఆమెకు సరైన ఫలితాలు ఇవ్వలేదు.

India Open 2022: రౌండో రౌండ్లో సైనా నెహ్వాల్ ఓటమి.. క్వార్టర్ ఫైనల్‌ చేరిన పీవీ సింధు..!
India Open 2022 Saina Nehwal Knocked Out
Follow us on

India Open 2022: ఈ ఏడాది తొలి బ్యాడ్మింటన్ టోర్నీ ఇండియా ఓపెన్ (India Open 2022) లో సైనా నెహ్వాల్ ప్రయాణం రెండో రౌండ్‌లోనే ఆగిపోయింది. ఆమె 17-21, 9-21 వరుస గేమ్‌లలో 111వ ర్యాంక్‌తో ఉన్న మాళవికా బన్సోద్‌ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో టోర్నీలో భారత్‌కు చెందిన మరో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. ఆమె తన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇరా శర్మపై 21-10, 21-10 తేడాతో విజయం సాధించింది. ఇవి కాకుండా అష్మితా చలిహా తన రెండో రౌండ్ మ్యాచ్‌లో కూడా విజయం సాధించింది. ఇక, ఇప్పుడు మూడో రౌండ్‌లో పీవీ సింధుతో తలపడనుంది.

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ద్వారా సైనా నెహ్వాల్ చాలా కాలం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టింది. అయితే కొత్త సంవత్సరం ఆమెకు సరిగ్గా ప్రారంభం కాలేదు. మొదటి రౌండ్‌లో తన చెక్ రిపబ్లిక్ ప్రత్యర్థి తెరెజా స్వాబికోవా రిటైర్డ్ హర్ట్ కారణంగా సైనా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. కానీ, ఆమె ముందుకు తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయింది.

క్వార్టర్ ఫైనల్‌లో స్వదేశీ క్రీడాకారిణితో సింధు ఢీ..
మరోవైపు 26 ఏళ్ల ప్రపంచ ఏడో ర్యాంక్‌ మహిళా షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. ఆమె రెండవ రౌండ్‌లో ఇరా శర్మపై తన స్ట్రెయిట్ గేమ్‌లో ఈజీగా విజయం సాధించింది. సింధుతో పాటు అశ్మితా చాహిలా 21-17, 21-14తో హోయక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరు విజేతలు క్వార్టర్ ఫైనల్స్‌లో పోటీపడనున్నారు. టోర్నీలో ఐదో సీడ్ రష్యా షట్లర్‌ను అశ్మిత తొలి రౌండ్‌లోనే చిత్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె సింధుకు ఎలాంటి ఛాలెంజ్‌ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

టోర్నమెంట్‌పై కరోనా ప్రభావం, 7గురు ఆటగాళ్లు వైదొలిగారు..
అంతకుముందు, 7గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో టోర్నమెంట్‌లో కలకలం రేగింది. ఆ ఆటగాళ్లందరూ తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. వారిలో సమీర్ వర్మ. సమీర్ వర్మ నిష్క్రమణ తర్వాత భారత్ ఆశలన్నీ ఇప్పుడు మూడో సీడ్ లక్ష్యసేన్, 8వ సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్‌లపైనే ఉన్నాయి. క్వార్టర్స్‌లో ప్రణయ్‌కు వాకోవర్ లభించింది. ఎందుకంటే అతని ప్రత్యర్థి మంజునాథ్ కరోనా పాజిటివ్‌గా ఉండటంతో టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు.

Also Read: IND vs SA: విరాట్ కోహ్లీకి ప్రత్యేక హోదా తెచ్చిన భారత పేస్ బౌలర్లు.. అదేంటో తెలుసా?

Watch Video: వాట్ ఏ క్యాచ్.. షాకైన పుజారా.. చిరుత లాంటి ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న సౌతాఫ్రికా ప్లేయర్..!