AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pro Kabaddi: ఫైనల్ మ్యాచ్‌కు వేళాయే.. పీకేఎల్ 10వ సీజన్‌లో టాప్ రైడర్లు, డిఫెండర్లు వీరే..

Pro Kabaddi 2023: ఒకవైపు, పుణెరి పల్టాన్ వరుసగా రెండో సీజన్‌లోనూ ఫైనల్స్‌కు చేరుకోగా, మరోవైపు ప్రో కబడ్డీ లీగ్‌లో హర్యానా స్టీలర్స్‌కి ఇదే తొలి ఫైనల్ మ్యాచ్. ఈ రెండు జట్లూ ఇప్పటి వరకు ట్రోఫీని గెలవలేకపోయాయి. అందుకే ప్రో కబడ్డీ 2023లో కొత్త ఛాంపియన్‌ దొరకడం ఖాయమైంది. ఈ సీజన్‌లోని రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల తర్వాత, అత్యధిక రైడ్ పాయింట్లు ప్రస్తుతం జైపూర్ పింక్ పాంథర్స్‌కు చెందిన అర్జున్ దేశ్వాల్, అత్యధిక ట్యాకిల్ పాయింట్లు పుణెరి పల్టన్‌కు చెందిన మహ్మద్రెజా షాడ్ నిలిచారు. కాగా, ఇప్పుడు ప్రో కబడ్డీ 10వ సీజన్‌లో టాప్ 5 రైడర్లు, డిఫెండర్ల గురించి తెలుసుకుందాం..

Pro Kabaddi: ఫైనల్ మ్యాచ్‌కు వేళాయే.. పీకేఎల్ 10వ సీజన్‌లో టాప్ రైడర్లు, డిఫెండర్లు వీరే..
Puneri Paltan Vs Haryana St
Venkata Chari
|

Updated on: Mar 01, 2024 | 7:14 AM

Share

PKL 10: ప్రో కబడ్డీ (Pro Kabaddi 2023)10వ సీజన్ సెమీ-ఫైనల్‌లు ముగిశాయి. ఇప్పుడు ఫైనల్ విజేత కోసం అంతా ఎదురుచూస్తున్నారు. పుణెరి పల్టాన్‌పై పాట్నా పైరేట్స్‌పై విజయం సాధించగా, హర్యానా స్టీలర్స్‌పై డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది.

ఒకవైపు, పుణెరి పల్టాన్ వరుసగా రెండో సీజన్‌లోనూ ఫైనల్స్‌కు చేరుకోగా, మరోవైపు ప్రో కబడ్డీ లీగ్‌లో హర్యానా స్టీలర్స్‌కి ఇదే తొలి ఫైనల్ మ్యాచ్. ఈ రెండు జట్లూ ఇప్పటి వరకు ట్రోఫీని గెలవలేకపోయాయి. అందుకే ప్రో కబడ్డీ 2023లో కొత్త ఛాంపియన్‌ దొరకడం ఖాయమైంది.

ఈ సీజన్‌లోని రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల తర్వాత, అత్యధిక రైడ్ పాయింట్లు ప్రస్తుతం జైపూర్ పింక్ పాంథర్స్‌కు చెందిన అర్జున్ దేశ్వాల్, అత్యధిక ట్యాకిల్ పాయింట్లు పుణెరి పల్టన్‌కు చెందిన మహ్మద్రెజా షాడ్ నిలిచారు. కాగా, ఇప్పుడు ప్రో కబడ్డీ 10వ సీజన్‌లో టాప్ 5 రైడర్లు, డిఫెండర్ల గురించి తెలుసుకుందాం..

PKL 10లో అత్యధిక రైడ్ పాయింట్‌లను సాధించిన ప్లేయర్లు..

1) అర్జున్ దేశ్వాల్ (జైపూర్ పింక్ పాంథర్స్) – 23 మ్యాచ్‌ల తర్వాత 276 రైడ్ పాయింట్లు

2) అషు మాలిక్ (దబాంగ్ ఢిల్లీ KC) – 23 మ్యాచ్‌ల తర్వాత 276 రైడ్ పాయింట్లు

3) పవన్ కుమార్ సెహ్రావత్ (తెలుగు టైటాన్స్) – 21 మ్యాచ్‌ల్లో 202 రైడ్ పాయింట్లు

4) మణిందర్ సింగ్ (బెంగాల్ వారియర్స్) – 21 మ్యాచ్‌ల్లో 197 రైడ్ పాయింట్లు

5) నరేంద్ర కండోలా (తమిళ తలైవాస్) – 21 మ్యాచ్‌ల్లో 186 రైడ్ పాయింట్లు

PKL 10లో అత్యధిక టాకిల్ పాయింట్లు సాధించిన ఐదుగురు డిఫెండర్లు..

1) మహ్మద్రెజా షాడ్లూ (పునేరి పల్టన్) – 23 మ్యాచ్‌ల్లో 97 ట్యాకిల్ పాయింట్లు

2) కృష్ణ ధుల్ (పట్నా పైరేట్స్) – 24 మ్యాచ్‌ల్లో 78 ట్యాకిల్ పాయింట్లు

3) యోగేష్ (దబాంగ్ ఢిల్లీ KC) – 23 మ్యాచ్‌ల్లో 74 ట్యాకిల్ పాయింట్లు

4) రాహుల్ సెట్పాల్ (హర్యానా స్టీలర్స్) – 22 మ్యాచ్‌ల్లో 71 ట్యాకిల్ పాయింట్లు

5) మోహిత్ నందల్ (హర్యానా స్టీలర్స్) – 23 మ్యాచ్‌ల్లో 70 ట్యాకిల్ పాయింట్లు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..