Diamond League Final: డైమండ్ లీగ్‌లో వెనుకబడిన నీరజ్ చోప్రా.. 83.80 మీటర్లతో రెండవ స్థానం..

|

Sep 17, 2023 | 5:48 AM

Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ 2023 ఫైనల్‌లో టైటిల్‌ దక్కించుకోలేకపోయాడు. అమెరికాలోని యూజీన్‌లో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో వచ్చిన నీరజ్‌ అత్యుత్తమ త్రో 83.80 మీటర్లు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెచ్ 84.24 మీటర్లు విసిరి టైటిల్‌ను గెలుచుకున్నాడు. కాగా, ఫిన్‌లాండ్‌కు చెందిన ఆలివర్ హెలాండర్ 83.74 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. గతేడాది డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌ బంగారు పతకం సాధించాడు. నీరజ్ మొదటిసారి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

Diamond League Final: డైమండ్ లీగ్‌లో వెనుకబడిన నీరజ్ చోప్రా.. 83.80 మీటర్లతో రెండవ స్థానం..
Neeraj Chopra
Follow us on

Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ 2023 ఫైనల్‌లో టైటిల్‌ దక్కించుకోలేకపోయాడు. అమెరికాలోని యూజీన్‌లో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో వచ్చిన నీరజ్‌ అత్యుత్తమ త్రో 83.80 మీటర్లు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెచ్ 84.24 మీటర్లు విసిరి టైటిల్‌ను గెలుచుకున్నాడు. కాగా, ఫిన్‌లాండ్‌కు చెందిన ఆలివర్ హెలాండర్ 83.74 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. గతేడాది డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌ బంగారు పతకం సాధించాడు. నీరజ్ మొదటిసారి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

గెలిచుంటే.. మూడవ ఆటగాడు అయ్యేవాడు..

నీరజ్ చోప్రా ఈ టైటిల్‌ను గెలుచుకుని ఉంటే, డైమండ్ లీగ్ ట్రోఫీని కాపాడుకున్న మూడవ ఆటగాడు నిలిచేవాడు. కానీ, అది జరుగలేదు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన విటెజ్‌స్లావ్ వెస్లీ 2012, 2013లో ఈ ఫీట్ సాధించగా, అదే దేశానికి చెందిన జాకుబ్ వడ్లెచ్ 2016, 2017లో ఈ ఫీట్ సాధించాడు. రెండవ స్థానంలో నిలిచినందుకు నీరజ్‌కి 12 వేల డాలర్ల ప్రైజ్ మనీ లభించనుంది. అదే సమయంలో టైటిల్ నెగ్గిన యాకుబ్ వాడ్లెచ్ కు 30 వేల డాలర్ల ప్రైజ్ మనీ లభించనుంది.

నీరజ్ మ్యాచ్ ఇలా సాగింది..

మొదటి త్రో: నీరజ్ మొదటి ప్రయత్నం ఫౌల్.

రెండో త్రో: నీరజ్ త్రోను 83.80 మీటర్ల దూరంలో విసిరాడు. ఈ త్రోతో రెండో స్థానానికి చేరుకున్నాడు.

మూడో త్రో: నీరజ్ త్రోను 81.37 మీటర్ల దూరంలో విసిరాడు.

నాలుగో త్రో: నీరజ్ వేసిన నాలుగో త్రో ఫౌల్.

ఐదో త్రో: నీరజ్ 80.74 మీటర్ల త్రో విసిరాడు.

ఆరో త్రో: నీరజ్ చోప్రా ఆరో, చివరి త్రోలో 80.90 మీటర్లు జావెలిన్ విసిరాడు.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..