Asian Games 2023 Day 5: 5వ రోజు అదరగొట్టిన భారత్.. పాయింట్ల పట్టికలో 5వ స్థానం.. ఖాతాలో ఎన్ని పతకాలు చేరాయంటే?

Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో ఐదవ రోజు వరకు, భారతదేశం మొత్తం 25 పతకాలను గెలుచుకుంది. ఈ పతకాల్లో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ఆసియా క్రీడలు 2023లో భారతదేశం అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. ఈవెంట్‌లో ఐదో రోజు షూటింగ్‌లో భారత్ మరో స్వర్ణం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్‌లతో కూడిన భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది.

Asian Games 2023 Day 5: 5వ రోజు అదరగొట్టిన భారత్.. పాయింట్ల పట్టికలో 5వ స్థానం.. ఖాతాలో ఎన్ని పతకాలు చేరాయంటే?
Asain Games India Medals

Updated on: Sep 29, 2023 | 2:41 AM

Asian Games 2023 Day 5: ఆసియా క్రీడలు 2023లో భారతదేశం అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. ఈవెంట్‌లో ఐదో రోజు షూటింగ్‌లో భారత్ మరో స్వర్ణం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్‌లతో కూడిన భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. రోషిబినా దేవి 5వ రోజు రజతం రూపంలో దేశానికి తొలి పతకాన్ని అందించింది. వుషులో 60 కేజీల విభాగంలో చైనాపై రోషిబినా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ విధంగా రజతం సాధించాడు.

ఐదో రోజు వరకు భారత్ మొత్తం 25 పతకాలు సాధించింది. ఈ పతకాల్లో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. సరబ్‌జోత్ ద్వారా భారత్‌కు మరో స్వర్ణం గెలిచే అవకాశం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ మంచి ఆరంభంతో నాలుగో స్థానంలో నిలిచాడు. దీని తర్వాత, గుర్రపు స్వారీలో భారత్‌కు 5వ రోజు మూడో పతకం కాంస్యం రూపంలో వచ్చింది. ఈ పతకాన్ని అనుష్క అగర్వాల్ గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన హాకీ జట్టు..

ఆసియా క్రీడల మూడో మ్యాచ్‌లో భారత హాకీ జట్టు జపాన్‌ను ఓడించింది. భారత్ 4-2తో జపాన్‌ను ఓడించింది. అంతకుముందు సింగపూర్‌పై భారత్ 16-1 తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో భారత్ 16-0తో ఉజ్బెకిస్థాన్‌ను ఓడించింది.

టెన్నిస్‌లో కనీసం కాంస్యం ఖాయం..

టెన్నిస్‌ డబుల్స్‌లో భారత జోడీ రోహన్‌ బోపన్న-రుతుజా భోసలే జోడీ 7-5, 6-3తో కజకిస్థాన్‌కు చెందిన జిబెక్‌ కులం, జిబెక్‌ కులంబాయెవా, గ్రిగరీ లోమాకిన్‌ జోడీని ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌కు చేరుకోవడం ద్వారా భారత జోడీ కనీసం కాంస్యం సాధించింది.

టెన్నిస్‌లోనే కనీసం రజతం ఖాయం..

పురుషుల జోడీ రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేని సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియా జోడీ సియోంగ్‌చాన్ హాంగ్, సూన్‌వూ క్వాన్‌పై విజయం సాధించారు. ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా భారత జోడీ కనీసం రజతం ఖాయం చేసుకుంది.

పురుషులు, మహిళలు ఇద్దరికీ స్క్వాష్‌లో పతకం..

మలేషియాను 3-0తో ఓడించిన భారత మహిళల స్క్వాష్‌ జట్టు సెమీస్‌లో చోటు దక్కించుకుంది. ఈ విధంగా మహిళల స్క్వాష్ జట్టు కనీసం కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు సెమీ ఫైనల్ మ్యాచ్ హాంకాంగ్‌తో జరగనుంది.

ఇది కాకుండా, పురుషుల స్క్వాష్ జట్టు కూడా గ్రూప్ దశలో నేపాల్‌ను 3-0తో ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ విధంగా పురుషుల స్క్వాష్ జట్టుకు కనీసం కాంస్యం కూడా ఖాయమైంది.

బాక్సింగ్‌లో మంచి ప్రదర్శన..

భారత బాక్సర్ జాస్మిన్ 5-0తో విజయం సాధించింది. మొదటి రౌండ్ గేమ్‌లో సౌదీ బాక్సర్‌పై జాస్మిన్ ఏకపక్ష విజయం సాధించింది. దీంతో రెండో రౌండ్‌లో దూకుడు చూసి విజేతగా నిలిచింది.

టేబుల్ టెన్నిస్‌లో చివరి 16లో భారత జోడీ..

టేబుల్ టెన్నిస్‌లో భారత పురుషుల జోడీ శరత్ కమల్, సత్యన్ 32వ రౌండ్ మ్యాచ్‌లో మంగోలియాకు చెందిన సెర్-ఓడ్ గంఖుయాగ్, మన్లైజర్గల్ ముంఖ్-ఓచిర్‌లను 3-0తో ఓడించి చివరి 16లో చేరారు.

క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు..

భారత స్టార్ బ్యాడ్మింటన్ మహిళా క్రీడాకారిణి పీవీ సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది.

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సౌదీ అరేబియా ఓటమితో భారత్ ఔట్..

ఆసియా క్రీడలలో, సౌదీతో జరిగిన మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 0-2 తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత భారత ఫుట్‌బాల్ జట్టు ఆసియా క్రీడల నుంచి నిష్క్రమించింది. సునీల్ ఛెత్రీ సారథ్యంలోని ఫుట్‌బాల్ జట్టుకు ఆసియా క్రీడలు అంతగా కలసి రాలేదు.

పతకాల పట్టికలో భారత్‌ టాప్‌-5..

ఐదో రోజు ముగిసే సమయానికి పతకాల పట్టికలో భారత్ 5వ స్థానానికి చేరుకోవడం గమనార్హం. ఆతిథ్య చైనా ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. చైనా ఇప్పటివరకు అత్యధికంగా 90 బంగారు పతకాలు సాధించింది. ఈ జాబితాలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా రెండో స్థానంలో, జపాన్ మూడో స్థానంలో, ఉజ్బెకిస్థాన్ నాలుగో స్థానంలో, భారత్ ఐదో స్థానంలో నిలిచాయి. కొరియా 24, జపాన్‌ 18, ఉజ్బెకిస్థాన్‌, భారత్‌లు తలో 6 బంగారు పతకాలు సాధించాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..