Manu Bhaker:  మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన..

|

Jan 19, 2025 | 2:19 PM

స్టార్ షూటర్, ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆమె కుటుంబ సభ్యులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని మహేంద్రగఢ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ వారిని ఢీకొట్టి పరారయ్యాడు.

Manu Bhaker:  మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన..
Manu Bhaker
Follow us on

భారత స్టార్ షూటర్ మను భాకర్‌ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మను భాకర్ మామ, అమ్మమ్మ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని మహేంద్రగఢ్‌లోని బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మను భాకర్ మామ, అమ్మమ్మ ఇద్దరూ స్కూటీపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా కారు వారిని ఢీకొట్టింది. దీంతో వారు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన మరుక్షణమే కారు డ్రైవర్‌ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. మను భాకర్ మామ యుద్ధవీర్ సింగ్ రోడ్‌వేస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని ఇల్లు మహేంద్రగడ్డ బైపాస్‌లో ఉంది. ఎప్పటిలాగే ఇవాళ కూడా పని నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరాడు. అదే సమయంలో మను అమ్మమ్మ సావిత్రి దేవి లోహారు చౌక్‌లోని తన చిన్న కొడుకు ఇంటికి వెళ్లాలనుకుంది. దాంతో యుధ్వీర్ తన తల్లిని బైక్ ఎక్కించమని కోరగా, ఇద్దరూ కలిసి బయలు దేరారు. ను భాకర్ మేనమామ ద్విచక్ర వాహనంపై కలియానా మలుపు దగ్గరకు వచ్చారు. అదే సమయంలో ముందు నుంచి అతివేగంతో వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది.  దీంతో యుధ్వీర్ సింగ్, సావిత్రి దేవి రోడ్డుపై పడి పోయారు.  రక్తస్రావం ఎక్కువ కావడంతో  ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన బోల్తా పడింది.

 

ఇవి కూడా చదవండి

ఘటన అనంతరం కారు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు మనుభాకర్‌ మామ, అమ్మమ్మ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలాగే, ప్రస్తుతం ఘటనపై పోలీసులు విచారణ జరుపుతూ నిందితుల కోసం గాలిస్తున్నారు. మను భాకర్ రెండు రోజుల క్రితం రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. అంతలోనే  ఈ విషాద ఘటన చోటు చేసుకుంది

పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది.  తద్వారా ఒలింపిక్స్‌లో ఇలాంటి ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. మను భాకర్ అమ్మమ్మ సావిత్రి దేవి కూడా జాతీయ క్రీడాకారిణి. జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది.  మను భాకర్ అమ్మమ్మ ఒలింపిక్స్‌లో ఆడాలని కలలు కంది.  కానీ ఆమెకు  కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించలేదు.

ఘటనా స్థలం.. వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..