Neeraj Chopra: మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న నీరజ్‌ చోప్రా.. డైమండ్‌ లీగ్‌ మీట్‌లో..

Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. డైమండ్‌ లీట్‌ మీట్‌లో జాతీయ రికార్డును సాధించాడు. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో గురువారం...

Neeraj Chopra: మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న నీరజ్‌ చోప్రా.. డైమండ్‌ లీగ్‌ మీట్‌లో..
World Athletics Championships 2022 Live Streaming

Updated on: Jul 01, 2022 | 7:29 AM

Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. డైమండ్‌ లీట్‌ మీట్‌లో జాతీయ రికార్డును సాధించాడు. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో గురువారం జరిగిన పోటీలో పాల్గొన్న నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. 89.94 మీటర్లకు విసరడంతో నీరజ్‌ ఈ రికార్డును నెలకొల్పాడు. ఇక రెండో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 84.37 మీటర్లు విసిరాడు. గ్రెనేడియన్ అథ్లెట్ అండర్సన్ పీటర్సన్ తన మూడో ప్రయత్నంలో 90 మీటర్లను అధిగమించాడు.

పీటర్సన్‌ 90.31 మీటర్లు విసిరాడు దీంతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇక మూడో త్రోలో నీరజ్ 87.46 మీటర్ల మార్కును కొట్టి రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్ తన నాల్గవ ప్రయత్నంలో 84.77 మీటర్లు నమోదు చేయడంతో ఇద్దరు అథ్లెట్ల మధ్య నెక్‌ టు నెక్‌ పోటీ ఏర్పడింది. అయితే అండర్సన్‌ 85.03 మీటర్లతో ముందంజలో నిలిచాడు. నీరజ్ తన ఐదో ప్రయత్నంలో 86.67 మీటర్లను తాకాడు. అదే రౌండ్‌లో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 89.08 మీటర్లు విసిరి మూడో స్థానానికి చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..