Neeraj Chopra Marriage: ఓ ఇంటివాడైన నీరజ్‌ చోప్రా.. అమ్మాయి ఎవరంటే..?

రెండుసార్లు ఒలంపిక్ పతకాలు సాధించిన భారత స్టార్ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) పెళ్లి బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. హిమానీతో నీరజ్‌ చోప్రా వివాహం రెండు రోజుల క్రితం జరగ్గా.. ఈ విషయాన్ని నీరజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

Neeraj Chopra Marriage: ఓ ఇంటివాడైన నీరజ్‌ చోప్రా.. అమ్మాయి ఎవరంటే..?
Neeraj Chopra Married[1]

Updated on: Jan 19, 2025 | 10:40 PM

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) పెళ్లి బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. హిమానీతో నీరజ్‌ చోప్రా వివాహం రెండు రోజుల క్రితం జరగ్గా.. ఈ విషయాన్ని నీరజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా నీరజ్‌ చోప్రా షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇరు కుటుంబాలకు చెందిన వారు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నీరజ్ పేర్కొన్నాడు. సోనీపట్‌ ప్రాంతానికి చెందిన హిమానీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. నీరజ్‌ చోప్రా వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌ (ట్యోక్యో, పారిస్‌)లో జావెలిన్‌ త్రోలో పతకాలు కైవసం చేసుకోవడం తెలిసిందే.

తన మ్యారేజ్‌కు సంబంధించి ఎలాంటి ముందస్తు ప్రకటన చేయని నీరజ్ చోప్రా.. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పెళ్లికి సంబంధించి 3 ఫొటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇందులో తన తల్లితో దిగిన ఓ ఫొటో కూడా ఉంది. కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు.

హిమానీతో నీరజ్ చోప్రా పెళ్లి