
మెస్సీ వస్తున్నాడు.. మెస్సీ మన ప్లేయర్లతో ఆడబోతున్నాడు. సిటీస్ అన్నీ మెస్సీ ఫ్లెక్సీలతో నిండిపోతున్నాయ్. హూ ఈజ్ మెస్సీ. వై మెస్సీ. ఏంటీ ఫీవర్. దేనికంత క్రేజ్. ఇండియా వైడ్‌గా ఇప్పుడిదే టాపిక్. మెయిన్‌గా తెలుగు రాష్ట్రాలు.. పర్టిక్యులర్లీ హైదరాబాద్‌లో మెస్సీ మేనియాతో పూనకాలు తెచ్చుకుంటున్నారు. లిటరల్లీ.. ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కైతే ఆ పేరే ఓ వైబ్రేషన్. మెస్సీ.. నాట్ జస్ట్ ఏ నేమ్. ఇట్స్ ఏ బ్రాండ్. ఈ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్ వినండొకసారి. 2022 ప్రపంచకప్‌లో అర్జెంటీనా టీమ్‌ను గెలిపించాడు మెస్సీ. అది డిసెంబర్ మంత్. అంతే.. ఇక ఆ నెలలో పుట్టిన ప్రతి 70 మంది పిల్లల్లో ఒకరికి మెస్సీ పేరే పెట్టుకున్నారు. దట్ మీన్స్.. వరల్డ్ వైడ్‌గా ఆ పేరు ఎంతలా కమ్మేసిందో చెప్పడానికిదో ఎగ్జాంపుల్. ఇంకో ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్.. అదే వరల్డ్‌కప్‌లో మెస్సీ వేసుకున్న ఆరు జెర్సీలను వేలానికి పెట్టారు. 65 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు వాటిని. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ హిస్టరీలో ఇదో సంచలనం. అన్‌బీటెడ్ రికార్డ్ కూడా. దటీజ్ మెస్సీ. ప్రపంచంలో ఏ దేశంలో మెస్సీ ఫుట్‌బాల్ ఆడుతున్నా సరే.. ఇసుకేస్తే రాలనంత జనం స్టేడియానికి పరిగెత్తుకొస్తారు. అదీ.. మెస్సీ లెవెల్. అలాంటి దిగ్గజ ఆటగాడు.. మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో అడుగుపెడుతున్నారు. ఇంతకీ.. మెస్సీ రాక వెనక పర్పస్ ఏంటి? మెస్సీ టూర్‌తో మనకొచ్చే ప్రాఫిట్ ఏంటి? తెలుసుకుందాం..! ‘కింగ్ లియో’ అన్‌బిలీవబుల్ టాలెంట్.. ఇన్‌క్రెడిబుల్...