Gujarat Titans: మాథ్యూ వేడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్.. తనది చెత్త బ్యాటింగ్ అని వ్యాఖ్య
ఐపీల్-15 వ సీజన్ లో తొలిసారి అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు.. ఫైనల్ కు దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. ప్లే ఆఫ్స్ లో ఉన్న అన్ని జట్ల కంటే ముందే ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్న గుజరాత్ ట్రోఫీపై...
ఐపీల్-15 వ సీజన్ లో తొలిసారి అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు.. ఫైనల్ కు దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. ప్లే ఆఫ్స్ లో ఉన్న అన్ని జట్ల కంటే ముందే ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్న గుజరాత్ ట్రోఫీపై కన్నేసింది. ఈ క్రమంలో గుజరాత్ ప్లేయర్ మాథ్యూ వేడ్(Mathew Wade) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఫైనల్ కు చేరినా సంతోషంగా లేమని చెప్పారు. పర్సనల్ గా తనకు ఈ సీజన్ చికాకు కలిగిస్తోందన్న మాథ్యూ వేడ్.. బ్యాటింగ్ సరిగా చేయకపోవడమే అందుకు ప్రధాన కారణమన్నాడు. రాజస్థాన్‌తో జరిగిన కీలకమైన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో 35 పరుగులు చేసేంత వరకు తనది చెత్త బ్యాటింగ్ లాగానే కనిపించిందని చెప్పారు. టీ- 20 క్రికెట్‌లో దూకుడుగా ఆడితేనే కలిసొస్తుందని అభిప్రాయపడ్డారు. కీలకమైన ఫైనల్‌కు ముందు కాస్త మంచి బ్యాటింగ్ చేయడం ఆనందం కలిగించిందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా నుంచి మంచి సపోర్ట్ ఉందని చెప్పారు. ఈసారి కప్ గుజరాత్‌దే అని మాథ్యూ వేడ్ స్పష్టం చేశారు. లీగ్ చివరి మ్యాచ్ లో ఆదివారం గుజరాత్, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి.
మంగళవారం జరిగిన క్వాలిఫయర్ – 1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మిల్లర్ (68*), పాండ్యా (40*) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించడంతో గుజరాత్ విజయతీరాలకు చేరింది. దీంతో ఐపీఎల్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరికి గుజరాత్ విజయాన్ని అందుకుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.