Lionel Messi: ఫుట్‌బాల్ క్రీడాభిమానులకు శుభవార్త.. నేషనల్ టీమ్ నుంచి రిటైర్ కావడంలేదన్న అర్జెంటీనా దిగ్గజం ప్లేయర్..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ క్రీడాభిమానులకు ఉపశమనం కలిగించేలా లియోనెల్ మెస్సీ ఒక ప్రకటన చేశాడు. అర్జెంటీనా కోసం తాను ఫుట్‌బాల్ ఆడటం కొనసాగిస్తానని..
ఖతర్ వేదికగా ఆదివారం జరిగిన ఫీఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ట్రోఫీ విన్నర్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులను అలరించింది. మరోవైపు ఫైనల్‌కు ముందు ‘ఈ మ్యాచ్ నాకు చివరి అంతర్జాతీయ మ్యాచ్’ అని లియోనాల్ మెస్సీ ప్రకటించడంతో ఫుట్‌బాల్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఫీఫా కప్ గెలుచుకున్న తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ క్రీడాభిమానులకు ఉపశమనం కలిగించేలా లియోనెల్ మెస్సీ ఒక ప్రకటన చేశాడు. అర్జెంటీనా కోసం తాను ఫుట్‌బాల్ ఆడటం కొనసాగిస్తానని మెస్సీ ప్రకటించాడు. ‘‘అర్జెంటీనా నేషనల్ టీమ్ నుంచి నేను రిటైర్ కావడం లేదు. చాంపియన్‌గా మారిన అర్జెంటీనా జట్టుతో కలిసి నేను ఇంకా ఆటను కొనసాగించాలనుకుంటున్నాన’’ని మెస్సీ ప్రకటించాడు. ఇప్పటికే అర్జెంటీనా ప్రపంచకప్ విజేతగా నిలిచిందన్న ఆనందంలో ఉన్న ఫుట్‌బాల్ క్రీడాభిమానులు ఈ ప్రకటనతో ఆకాశమే హద్దు అన్నట్లుగా సంబరాలు చేసుకుంటున్నారు.
ఆదివారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో అర్జెంటీనా పెనాల్టీ షూట్‌అవుట్‌లో ఫ్రాన్స్‌పై 4-2 తేడాతో విజయాన్ని సాధించింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత అర్జెంటీనా సారథి లియోనాల్ మెస్సీ ప్రపంచకప్‌తో పాటు గోల్డెన్ బాల్‌ను కూడా అందుకున్నాడు. ఈ టోర్నమెంట్ ప్రారంభమయిన నాటి నుంచి అద్భుతంగా రాణించిన మెస్సీ కీలక సమయాల్లో గోల్స్ చేయడం, స్కోరింగ్ కోసం జట్టులోని తన సహచరులకు సహకరించడం వంటివి చేస్తూ అభిమానుల ఆదరాభిమానాలను పొందాడు. మరో వైపు ఫ్రాన్స్‌కు చెందిన కైలియన్ ఎంబాప్పే తర్వాత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా మెస్సీ నిలిచాడు.
Lionel Messi: “No, I’m not going to retire from the national team. I want to keep playing as World Cup champions with the Argentina shirt”
The legend continues ?? pic.twitter.com/1sVxlpp9Xt
— GOLAZO (@golazoargentino) December 18, 2022
కాగా, ఫీఫా ప్రపంచకప్ 2022 ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం సాధించిన సందర్భంగా భారతదేశంలోని ఆ దేశ రాయబారి హెచ్‌జే గోబ్బి.. అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే మెస్సీ తాజా ప్రకటన రాకముందు జరిగిన ఈ కార్యక్రమంలో గోబ్బి మాట్లాడుతూ..‘‘ఇది ఒక భావోద్వేగ క్షణం. ఇది మెస్సీకి చివరి ప్రపంచ కప్ కాదని నేను ఆశిస్తున్నాను. నేను అతనిని మరో ప్రపంచకప్ టోర్నీలో కూడా చూడాలనుకుంటున్నాను’’ అని అన్నారు. అలాగే కోల్‌కతా వీధుల్లో కూడా వందలాది మంది అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు(1978 , 1986, 2022) ఫీఫా టైటిల్ గెలుచుకున్న అర్జెంటీనాకు 1986 తర్వాత ఇదే మొదటిసారి.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..