
Kho Kho World Cup 2025: ఖో ఖోలో భారతదేశం మొదటి ప్రపంచ ఛాంపియన్ జట్టుగా అవతరించింది. జనవరి 19, ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో భారత మహిళల జట్టు ఏకపక్షంగా 38 పాయింట్ల భారీ తేడాతో నేపాల్‌ను సులభంగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీలో తొలి మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ ఆధిక్యతతో గెలుపొందిన భారత మహిళల జట్టు.. ఫైనల్‌లోనూ అదే స్టైల్‌ను కొనసాగించి 78-40 స్కోరుతో నేపాల్‌ను ఓడించి చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.
మొదటి ఖో ఖో ప్రపంచ కప్ జనవరి 13 నుంచి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో, భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 176 పాయింట్లు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతోనే టీమ్ ఇండియా తన అడుగులను స్పష్టం చేసింది. ప్రతి జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ముందుకు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ఫైనల్‌తో భారత జట్టు తన ఆశయాలను నిజం చేస్తూ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
👸 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲 𝐦𝐚𝐝𝐞 🇮🇳🏆
Congratulations to #TeamIndia women for claiming the 𝐟𝐢𝐫𝐬𝐭-𝐞𝐯𝐞𝐫 𝐊𝐡𝐨 𝐊𝐡𝐨 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 👏#KhoKhoWorldCup #KKWC2025 #TheWorldGoesKho #Khommunity #KhoKho #KKWCWomen pic.twitter.com/tqlBPbTIdc
— Kho Kho World Cup India 2025 (@Kkwcindia) January 19, 2025
ఈ మ్యాచ్ భారత జట్టుకు కఠినమైన మ్యాచ్‌గా మారింది. ఎందుకంటే నేపాల్ కూడా బలమైన ఖో ఖో జట్టు. కానీ, మొదటి మలుపు నుంచి భారత మహిళలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. టర్న్-1లో భారత జట్టు అటాక్ చేసి డిఫెన్స్‌లో నేపాలీ ఆటగాళ్ల తప్పిదాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. దీంతో 34-0తో భారీ ఆధిక్యంతో మ్యాచ్‌ను ప్రారంభించింది. రెండో టర్న్‌లో నేపాల్‌పై దాడి చేయడంతో ఈ జట్టు కూడా తన ఖాతా తెరిచినా భారత డిఫెండర్లు సులువుగా పాయింట్లు సాధించేందుకు అనుమతించలేదు. దీంతో రెండో టర్న్ తర్వాత స్కోరు 35-24గా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..