సీఏసీ పదవికి కపిల్‌దేవ్‌ రాజీనామా..నోటీసులతో మనస్తాపం

టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటి(సీఏసీ) చీఫ్‌ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు సుప్రీమ్‌కోర్టు నియమించిన క్రికెట్‌ పాలక మండలికి ఆయన ఈ మేరకు ఈమెయిల్‌ పంపిచారు. అయితే రాజీనామాకు గల కారణాన్ని కపిల్‌ వెల్లడించలేదని సమాచారం. రెండు రోజుల క్రితమే సీఏసీ సభ్యురాలు శాంత రంగస్వామి సైతం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శాంత సీఏసీ సభ్యురాలిగా ఉండడంతో పాటు ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌(ఐసీఏ)కు డైరెక్టర్‌గా […]

సీఏసీ పదవికి కపిల్‌దేవ్‌ రాజీనామా..నోటీసులతో మనస్తాపం
Ram Naramaneni

|

Oct 03, 2019 | 3:02 AM

టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటి(సీఏసీ) చీఫ్‌ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు సుప్రీమ్‌కోర్టు నియమించిన క్రికెట్‌ పాలక మండలికి ఆయన ఈ మేరకు ఈమెయిల్‌ పంపిచారు. అయితే రాజీనామాకు గల కారణాన్ని కపిల్‌ వెల్లడించలేదని సమాచారం. రెండు రోజుల క్రితమే సీఏసీ సభ్యురాలు శాంత రంగస్వామి సైతం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శాంత సీఏసీ సభ్యురాలిగా ఉండడంతో పాటు ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌(ఐసీఏ)కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. దీంతో ఆమె తన రెండు పదవులకు రాజీనామా చేసి ఐసీఏలో సామాన్య సభ్యురాలిగా కొనసాగేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు కపిల్‌దేవ్‌ కూడా రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన తాత్కాలిక క్రికెట్‌ సలహా మండలిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీకి కపిల్‌ నేతృత్వం వహించగా అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామి ఇతర సభ్యులుగా ఉన్నారు. వీరు జులై 2019 నుంచి ఈ బాధ్యతలు చేపట్టగా.. భారత జట్లకు ప్రధాన కోచ్‌లను ఎంపిక చేయడమే వీరి పని. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవికి ఇంటర్వ్యూలు చేసి రవిశాస్త్రిని తిరిగి నియమించారు. అంతకుముందు భారత మహిళల జట్టుకు కోచ్‌ను కూడా ఎంపిక చేసింది. కపిల్‌దేవ్‌ వ్యాఖ్యాతగా, ఫ్లడ్‌లైట్ల సంస్థ అధిపతిగా, భారత క్రికెటర్ల సంఘం(ఐసీఏ)సభ్యుడిగా ఉన్నారు. గైక్వాడ్‌ సొంత అకాడమీతో పాటు బీసీసీఐ అఫిలియేషన్‌ కమిటీలో సభ్యులు. శాంత కూడా ఐసీఏ సభ్యురాలు. అందరూ పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్‌కు కంప్లెయింట్  చేసాడు. దీంతో డీకే జైన్‌… అక్టోబర్‌ 10లోగా వివరణ ఇవ్వాలని సీఏసీకి నోటీసులు పంపారు.  ఇప్పటికే నోటీసులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శాంత రంగస్వామి సీఏసీ నుంచి తప్పుకున్నారు. తాజాగా సీఏసీ నుంచి కపిల్‌దేవ్‌ కూడా తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu