రిటైర్ అయ్యే సమయానికి బుమ్రా సూపర్‌స్టార్ అవుతాడు.. గిలెస్పీ ప్రశంసలు

కెరీర్‌కి రిటైర్‌మెంట్‌ ఇచ్చే లోపు బుమ్రా సూపర్‌స్టార్ అవుతాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ జేసన్ గిలెస్పీ అన్నారు. అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా ఆల్‌టైమ్ అత్యుత్తమ పేసర్‌గా అతడు నిలుస్తాడని కొనియాడారు.

రిటైర్ అయ్యే సమయానికి బుమ్రా సూపర్‌స్టార్ అవుతాడు.. గిలెస్పీ ప్రశంసలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 16, 2020 | 8:59 AM

Jason Gillespie Bumrah: కెరీర్‌కి రిటైర్‌మెంట్‌ ఇచ్చే లోపు బుమ్రా సూపర్‌స్టార్ అవుతాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ జేసన్ గిలెస్పీ అన్నారు. అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా ఆల్‌టైమ్ అత్యుత్తమ పేసర్‌గా అతడు నిలుస్తాడని కొనియాడారు. అందులో ఎలాంటి సందేహం లేదని వివరించారు. ప్రస్తుతం టీమిండియా పేస్ దళం ప్రపంచంలోనే మేటిగా ఉందని వివరించారు. (ఢిల్లీలో ‘ఆయిల్‌ రైన్‌’.. అగ్నిమాపక శాఖకు పోటెత్తిన ఫోన్లు)

ఇక షమి కూడా అద్భుతమైన బౌలర్ అని, ఇషాంత్ కూడా ఎంత ముఖ్యమైన ఆటగాడో నిరూపించుకున్నాడని అన్నారు. అతడి కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ వాటి విలువేంటో తెలియజేశాడని, నిత్యం తనను తాను మెరుగు పర్చుకుంటున్నాడని తెలిపారు. ఇక భువి, ఉమేష్‌ యాదవ్ కూడా అద్భుతమైన పేసర్లనని పేర్కొన్నారు. ఒకప్పుడు జవగళ్‌ శ్రీనాథ్‌ టీమిండియాలో మెరవగా.. ఆపై జహీర్‌ బౌలింగ్‌కి వన్నె తెచ్చాడని, వాళ్లతో వీళ్లని పోల్చడం కష్టమే అయినా.. బౌలింగ్‌లో మాత్రం టీమిండియా బలం పెరిగింది అని గిలెస్పీ వివరించారు. (కరోనాతో హర్యానా మొదటి మహిళా ఎంపీ చంద్రావతి దేవి కన్నుమూత)