అది వివాదాస్పదమైన క్యాచే, చెన్నై టెస్ట్‌ సంఘటనపై నిజం ఒప్పుకున్న ఇంజమామ్‌!

ఇండియా-పాకిస్తాన్‌ మధ్య రెండు దశాబ్దాల కిందట చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో ఆ మ్యాచ్‌ను వీక్షించిన అభిమానులకు తెలుసు.. విజయం రెండు జట్లతో దోబూచులాడి చివరకు పాకిస్తాన్‌ను వరించింది..

అది వివాదాస్పదమైన క్యాచే,  చెన్నై టెస్ట్‌ సంఘటనపై నిజం ఒప్పుకున్న ఇంజమామ్‌!

ఇండియా-పాకిస్తాన్‌ మధ్య రెండు దశాబ్దాల కిందట చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో ఆ మ్యాచ్‌ను వీక్షించిన అభిమానులకు తెలుసు.. విజయం రెండు జట్లతో దోబూచులాడి చివరకు పాకిస్తాన్‌ను వరించింది.. అయితే ఆ మ్యాచ్‌లో కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి.. సౌరబ్‌ గంగూలీ వివాదాస్పద రీతిలో అవుటయ్యారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు నాటి పాక్‌ క్రికెటర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ వివరంగా చెప్పుకొచ్చాడు.. వాస్తవానికి అది వివాదాస్పదమైన అవుటేనని ఇంజమామ్‌ అంగీకరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో గంగూలీ రెండు పరుగుల చేసి సక్లయిన్‌ ముస్తాక్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ మోయిన్‌ఖాన్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చాడు. పాకిస్తాన్‌ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్‌ చేశారు. ఫీల్డ్‌ అంపైర్ల కాసేపు చర్చించి గంగూలీని అవుట్‌గా ప్రకటించారు. నిజానికి గంగూలీ బ్యాట్‌కు తగిలిన బంతి నేరుగా మోయిన్‌ఖాన్‌ చేతిలో పడలేదు.. అజర్‌ మహమ్మద్‌ శరీరానికి తాకి కిందపడుతున్నప్పుడు మోయిన్‌ బంతిని అందుకున్నాడు.. అప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని తాను కచ్చితంగా చెప్పలేనని, హెల్త్‌ బాగోలేకపోతే తన బదులు అజర్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడని ఇంజమామ్‌ చెప్పాడు.. గంగూలీ అవుటైనప్పుడు తాను గ్రౌండ్‌లో లేనని, కాకపోతే అది మాత్రం సందేహాస్పదమైన అవుటేనని అంగీకరించాడు ఇంజమామ్‌. రిప్లేలో మాత్రం బాల్‌ అజర్‌ కాలికి తగిలిన తర్వాత నేలపై పడింది. ఆ తర్వాతే మోయిన్‌ క్యాచ్‌ అందుకున్నట్టు కనిపించింది.. ఏదైతేనేం… పాకిస్తాన్‌ ఆ టెస్ట్‌లో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక తాను నేషనల్‌ టీమ్‌లోకి ఎలా వచ్చానో కూడా ఇంజమామ్‌ చెప్పుకున్నాడు.. తాను నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నది చూసిన ఇమ్రాన్‌ఖాన్‌ వెంటనే జాతీయ జట్టుకు ఎంపిక చేశారని ఇంజమామ్‌ తెలిపాడు. శ్రీలంక సిరీస్‌లో వరుసగా రెండు వన్డే సెంచరీలు సాధించి ఇమ్రాన్‌ నమ్మకాన్ని నిలిపాడు. ఆ తర్వాత ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై చిచ్చరపిడుగులా చెలరేగిన సంగతి తెలిసిందే.. అటు పిమ్మట జాతీయ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ఇంజమామ్‌.. పాకిస్తాన్‌లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Click on your DTH Provider to Add TV9 Telugu