MS Dhoni: మహేంద్ర సింగ్ క్రికెట్ శకం ముగిసిందా? హాస్పిటల్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయ్..!

|

Jun 01, 2023 | 5:20 AM

మహేంద్ర సింగ్ క్రికెట్ శకం ముగిసిందా? ధోనీని మళ్లీ గ్రౌండ్ లో చూడగలమా? మోకాలు నొప్పితో బాధపడుతున్న ధోనీకి ఇదే చివరి సీజనా?. ధోనీ మోకాలు సర్జరీకి సంబంధించిన రిపోర్టులు ఏం చెబుతున్నాయి? అసలు రిపోర్ట్ వచ్చాయా? కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

MS Dhoni: మహేంద్ర సింగ్ క్రికెట్ శకం ముగిసిందా? హాస్పిటల్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయ్..!
Ms Dhoni Leg Pain
Follow us on

మహేంద్ర సింగ్ క్రికెట్ శకం ముగిసిందా? ధోనీని మళ్లీ గ్రౌండ్ లో చూడగలమా? మోకాలు నొప్పితో బాధపడుతున్న ధోనీకి ఇదే చివరి సీజనా?. ధోనీ మోకాలు సర్జరీకి సంబంధించిన రిపోర్టులు ఏం చెబుతున్నాయి? అసలు రిపోర్ట్ వచ్చాయా? కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారత మాజీ క్రికెటర్‌.. చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ మెకాలి నొప్పితోపాటు ఇతర గాయాలతో ధోనీ బాధపడుతున్నాడు. దీంతో వారం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చేరి.. టెస్టులు చేయించుకోనున్నాడు. మోకాలి నొప్పితోనే ఐపీఎల్ 2023 సీజన్లోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. టోర్నీ మొత్తం మోకాలి క్యాప్ తో ధరించి ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఎడమ మోకాలికి ధోనీ ఐస్ ప్యాక్‌లు పెట్టుకున్న ఫొటోలు మొన్న ఫైనల్ మ్యాచ్ లో వైరల్ అయ్యాయి. ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి దిగిన ఫొటోలో.. చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియంలో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత మైదానం మొత్తం కలియ తిరుగుతూ అభిమానులకు అభిమానులకు అభివాదం చేసే సమయంలోనూ ధోనీ మోకాలిపై ఐప్ ప్యాక్ ఉంచడం కనిపించింది.

మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ గా భావించారు.. దీనిపై రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన తరుణమని ధోనీ సైతం చెప్పాడు. కానీ అభిమానుల ప్రేమాభిమానాలను చూశాక.. మరో ఏడాది కూడా ఐపీఎల్ ఆడాలనిపిస్తోందని ధోనీ తెలిపాడు. తన మోకాలి పరిస్థితిని బట్టి, ఐపీఎల్ వేలానికి ముందే డిసెంబర్లో ఓ నిర్ణయానికి వస్తానన్నాడు. మోకాలి గాయంతో బాధపడుతున్నా అన్ని మ్యాచ్‌ల్లో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడంతోపాటు జట్టుకు అవసరమైన సందర్భాల్లో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే ముంబయిలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో పలు టెస్టులు చేయించుకుంటాడని తెలుస్తోంది. టెస్టులకు సంబంధించిన రిపోర్టులు వచ్చిన తర్వాత ధోనీ సర్జరీ చేయించుకుంటాడా లేదా అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..