ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

ఏసియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల కబడ్డీలో భారత్ స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల కబడ్డీలో గోల్డ్ మోడల్ సొంతం చేసుకుంది. ఇరాన్‌పై జరిగిన మ్యాచ్‌లో 40-34 తేడాతో భారత్ విజయం సాధించింది. కబడ్డీలో మొత్తానికి భారత్ సత్తా చాటింది.

ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
Kabaddi

Updated on: Sep 26, 2026 | 4:15 PM

ఏషియన్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. పురుషుల కబడ్డీలో భారత్ పసిడి గెలిచింది.  ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై 40-34 తేడాతో భారత్ విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం నాలుగు స్వర్ణాలు సాధించింది. ఉదయం మహిళల జట్టు కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించగా.. పురుషులు జట్టు కూడా స్వర్ణ పతకం గెలుపొందింది. దీంతో కబడ్డీలో భారత్  డబుల్ గోల్డెన్ పతకాలు సాధించినట్లయింది.  మహిళల కబడ్డీ జట్టు 37-34 తేడాతో ఇరాన్‌ను ఓడించి  విజయం సాధించింది. ఇప్పుడు పురుషుల జట్టు కూడా ఇరాన్‌ను ఓడించింది. పురుషుల కబడ్డీ ఫైనల్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో స్కోర్లు 20-20తో సమం కావంతో ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంత పోరులో చివరికి భారత్‌ పైచేయి సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీలో భారతదేశానికి ఇది తొమ్మిదవ స్వర్ణ పతకంగా చెప్పవచ్చు.

మహిళల కబడ్డీ ఫైనల్స్ కూడా ఉత్కంఠభరితంగా జరిగాయి. తొలి అర్ధ భాగంలో భారత్ 22-16 ఆధిక్యంలో ఉండగా.. రెండో అర్ధభాగంలో ఇరాన్ బలంగా పుంజుకుని 18-15 ఆధిక్యంలో ఉంది. చివరికి భారత్ పుంజుకుని విజయం సాధించింది. గోల్డ్ మెడల్ సాధించిన అనంతరం భారత జట్టు మైదానం చుట్టూ విజయ ప్రదక్షిణ చేసి, ‘వందేమాతరం’ జాతీయ గీతాన్ని ఆలపించింది. 2018 జకార్తా క్రీడల్లో ఇరాన్ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకోవడం మినహా మహిళల జట్టు ఇప్పుడు ప్రతి ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం గెలుచుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us