AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు తెలుసా.. జామకాయ వీరికి యమడేంజర్.. తిన్నారో ఆస్పత్రికి పరిగెత్తాల్సిందే..

జామపండును రోజూ తింటున్నారా? అయితే ఈ నిజం మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. కంటి చూపు, గుండె పనితీరును మెరుగుపరిచే జామపండు అందరికీ అమృతం కాకపోవచ్చు. మోతాదు దాటితే పొట్టను పాడు చేయడమే కాకుండా కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అసలు ఎవరూ ఈ పండుకు దూరంగా ఉండాలి..? తింటే ఎలాంటి సమస్యలు వస్తాయినేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Sep 26, 2026 | 3:26 PM

Share
పోషకాల గనిగా పేరుగాంచిన జామలో కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఎ, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులోని లైకోపీన్ అనే ఫైటోన్యూట్రియెంట్ క్యాన్సర్, కణితుల ముప్పు నుంచి శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడే బీటా-కెరోటిన్ కూడా ఇందులో పుష్కలంగా లభిస్తుంది.

1 / 5
అయితే అమృతం లాంటి జామపండును కూడా మితిమీరి తింటే ఆరోగ్యానికి ముప్పేనని హెచ్చరిస్తున్నారు జగనాబాద్‌కు చెందిన హోమియోపతి నిపుణుడు అమీర్ అన్వర్. సాధారణంగా జామలోని ఫైబర్ జీర్ణక్రియకు, మలబద్ధకం నివారణకు తోడ్పడుతుంది. కానీ దీనిని మోతాదుకు మించి తీసుకుంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తి కడుపుబ్బరం, తీవ్రమైన గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

2 / 5
జామపండులో గుండె, కండరాల పనితీరును మెరుగుపరిచే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అయితే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు అధిక పొటాషియంను తట్టుకోలేరని, ఇది రక్తంలో ప్రమాదకరమైన అసమతుల్యతకు దారితీస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు జామపండును వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.

3 / 5
మరోవైపు కొంతమందికి జామపండు సరిపడక అలెర్జీ సమస్యలు రావచ్చు. దురద, శరీర భాగాల్లో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. అలాగే గర్భిణులు, పాలిచ్చే తల్లులు జామపండు లేదా జామ ఆకు టీ తీసుకునే ముందు తమ గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

4 / 5
జామపండు శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగి ఉండటంతో పాటు కఫాన్ని పెంచుతుంది. అందుకే జలుబు, దగ్గుతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది. అంతేకాకుండా ఇది సహజంగానే రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది కాబట్టి డయాబెటిస్ బాధితులు జామను మరీ ఎక్కువగా తినకుండా మితంగా తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.

5 / 5
Follow Us