వెస్టిండీస్‌తో రెండో వన్డే: భారత్ గ్రాండ్ విక్టరీ!

వెస్టిండీస్‌తో రెండో వన్డే: భారత్ గ్రాండ్ విక్టరీ!

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ముందు బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. కోహ్లీ(120; 125బంతుల్లో 14×4, 1×6)సెంచరీతో వీరవిహారం చేశాడు.  అనంతరం ఛేజింగ్‌కు దిగిన విండీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. మధ్యలో వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి 270 పరుగులుగా నిర్దేశించారు. విండీస్‌ ఇన్నింగ్‌లో లూయిస్‌(65; 80బంతుల్లో 8×4, 1×6), పూరన్‌(42; […]

Ram Naramaneni

|

Aug 12, 2019 | 4:28 AM

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ముందు బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. కోహ్లీ(120; 125బంతుల్లో 14×4, 1×6)సెంచరీతో వీరవిహారం చేశాడు.  అనంతరం ఛేజింగ్‌కు దిగిన విండీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. మధ్యలో వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి 270 పరుగులుగా నిర్దేశించారు. విండీస్‌ ఇన్నింగ్‌లో లూయిస్‌(65; 80బంతుల్లో 8×4, 1×6), పూరన్‌(42; 52బంతుల్లో 4×4, 1×6) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా, షమి, కుల్దీప్‌ తలో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu