AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్​ ఓపెన్: సత్తా చాటిన ​సౌరభ్ వర్మ..టైటిల్ కైవసం

హైదరాబాద్​ ఓపెన్​లో భారత్​కు ఆదివారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్​ విభాగంలో సత్తా చాటిన సౌరభ్ వర్మ.. విజేతగా నిలిచి, మరో సూపర్​-100 టైటిల్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం 52 నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో సింగపూర్​కు చెందిన లోహ్ కియాన్ యూపై 21-13, 14-21, 21-16 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. మొదటి రౌండ్​లో 6-2తో ఆధిక్యంలోకి వెళ్లిన సౌరభ్.. 11-4తో అదే ఊపు కొనసాగించి తొలి గేమ్​ సాధించాడు. రెండో రౌండ్​​లో ఇద్దరూ […]

హైదరాబాద్​ ఓపెన్: సత్తా చాటిన ​సౌరభ్ వర్మ..టైటిల్ కైవసం
Ram Naramaneni
| Edited By: |

Updated on: Aug 12, 2019 | 7:05 AM

Share

హైదరాబాద్​ ఓపెన్​లో భారత్​కు ఆదివారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్​ విభాగంలో సత్తా చాటిన సౌరభ్ వర్మ.. విజేతగా నిలిచి, మరో సూపర్​-100 టైటిల్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం 52 నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో సింగపూర్​కు చెందిన లోహ్ కియాన్ యూపై 21-13, 14-21, 21-16 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. మొదటి రౌండ్​లో 6-2తో ఆధిక్యంలోకి వెళ్లిన సౌరభ్.. 11-4తో అదే ఊపు కొనసాగించి తొలి గేమ్​ సాధించాడు. రెండో రౌండ్​​లో ఇద్దరూ క్రీడాకారులు నువ్వా నేనా అంటూ ఆడారు. చివరికి విజయం ప్రత్యర్థినే వరించింది. నిర్ణయాత్మక మూడో రౌండ్​లో దూకుడుగా ఆడిన వర్మ..ఆ గేమ్​ను సొంతం చేసుకున్నాడు.గత సంవత్సరం డచ్ ఓపెన్, రష్యన్ ఓపెన్‌ సూపర్ 100 టైటిల్స్ గెలుచుకున్నాడు సౌరభ్ వర్మ. ఈ ఏడాది మేలో జరిగిన స్లోవేనియన్ ఇంటర్నేషనల్​లో విజేతగా గెలిచాడు.

మహిళా డబుల్స్​లో టాప్ సీడ్ భారత జోడి అశ్విని పొన్నప్ప- సిక్కి రెడ్డి.. ఈ విభాగంలో తొలి టైటిల్ కొట్టే అవకాశం కొద్దిలో కోల్పోయారు.​ కొరియన్ ద్వయం బేక్ హ నా- జుంగ్ క్యూంగ్ యన్ చేతిలో 17-21,17-21 పాయింట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

Follow Us
ప్రపంచ రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ ఇన్‌స్టా రీల్..
ప్రపంచ రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ ఇన్‌స్టా రీల్..
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..
ఉడకబెట్టిన గుడ్డు vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది మంచిది..?
ఉడకబెట్టిన గుడ్డు vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది మంచిది..?
మీ వంటగదిలో అస్సలు ఉండకూడని ఆహార పదార్థాలు.. యమ డేంజర్‌..!
మీ వంటగదిలో అస్సలు ఉండకూడని ఆహార పదార్థాలు.. యమ డేంజర్‌..!
ఫ్యామిలీ కథలో ట్విస్ట్‌.. కాసులు కురిపిస్తున్న కొత్త ఫార్ములా
ఫ్యామిలీ కథలో ట్విస్ట్‌.. కాసులు కురిపిస్తున్న కొత్త ఫార్ములా
జస్ట్ 15 మాత్రమే.. కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
జస్ట్ 15 మాత్రమే.. కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ తగ్గుతున్న ధరలు..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ తగ్గుతున్న ధరలు..
హైదరాబాద్‌లో ఉండేవారికి గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.6 లక్షలకే ప్లాట్
హైదరాబాద్‌లో ఉండేవారికి గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.6 లక్షలకే ప్లాట్
'నేను రెడీ' నుంచి సినిమా అదిరిపోయే రొమాంటిక్ సాంగ్
'నేను రెడీ' నుంచి సినిమా అదిరిపోయే రొమాంటిక్ సాంగ్
మిత్రమా..! జూలై 31 సమీపిస్తోంది.. గడువు దాటితే రూ.5000 ఫైన్
మిత్రమా..! జూలై 31 సమీపిస్తోంది.. గడువు దాటితే రూ.5000 ఫైన్