రన్ మెషీన్‌‌కు దాసోహం అంటున్న రికార్డ్స్..శభాష్ సారథి!

రన్ మెషీన్‌‌కు దాసోహం అంటున్న రికార్డ్స్..శభాష్ సారథి!

వెస్టిండీస్‌తో జరుగతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ శతకం సాధించాడు. అతడి వన్డేకెరీర్‌లో ఇది 42వ సెంచరీ. కాగా ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ కెప్టెన్  అరుదైన ఘనతలు సాధించాడు. ఒకే జట్టుపై… అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్​గా, అతి తక్కువ ఇన్నింగ్స్​లో 2000 పరుగుల్ని పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోహ్లీ.. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెస్టిండీస్​పై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్​గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ […]

Ram Naramaneni

|

Aug 12, 2019 | 3:03 AM

వెస్టిండీస్‌తో జరుగతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ శతకం సాధించాడు. అతడి వన్డేకెరీర్‌లో ఇది 42వ సెంచరీ. కాగా ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ కెప్టెన్  అరుదైన ఘనతలు సాధించాడు. ఒకే జట్టుపై… అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్​గా, అతి తక్కువ ఇన్నింగ్స్​లో 2000 పరుగుల్ని పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

కోహ్లీ.. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెస్టిండీస్​పై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్​గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్​కు చెందిన జావేద్ మియాందాద్​(1930 పరుగులు) పేరిట ఉంది. దానిని విరాట్ అధిగమించాడు.అదే విధంగా అతి తక్కువ ఇన్నింగ్స్​ల్లో ఒక జట్టుపై 2000 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్​గా చరిత్ర సృష్టించాడు కోహ్లీ. కేవలం 34 ఇన్నింగ్స్​ల్లో విరాట్ ఈ ఘనత సాధించాడు. తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(37 ఇన్నింగ్స్-ఆస్ట్రేలియా), సచిన్ టెండుల్కర్(40 ఇన్నింగ్స్-ఆస్ట్రేలియా) ఉన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu