భారత లక్ష్యం.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం..

భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లోనూ వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి వానదేవుడు పదేపదే అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ 35 ఓవర్లకు కుదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌ 41 బంతుల్లో 72 పరుగులు చేయగా.. లూయిస్‌ 29 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఆరంభాన్నిచ్చారు. దీంతో 35 ఓవర్లలో భారీ స్కోర్ […]

భారత లక్ష్యం.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం..
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2019 | 2:06 AM

భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లోనూ వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి వానదేవుడు పదేపదే అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ 35 ఓవర్లకు కుదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌ 41 బంతుల్లో 72 పరుగులు చేయగా.. లూయిస్‌ 29 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఆరంభాన్నిచ్చారు. దీంతో 35 ఓవర్లలో భారీ స్కోర్ నమోదు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్ మూడు‌, షమి రెండు వికెట్లు పడగొట్టారు. అయితే డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 255 పరుగులుగా నిర్దేశించారు.

ఇక బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయి.. కష్టాల్లో పడింది. ప్రస్తుతం 9 ఓవర్లకు 51 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.